ఆస్ట్రేలియాలో తెలంగాణా జాగృతి

33004551_n

తెలంగాణా రాష్ట్రావతరణ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియాలో తెలంగాణా జాగృతి అధినేత్రి శ్రీమతి కవిత కల్వకుంట్ల గారు వచ్చి ఆస్ట్రేలియా తెలంగాణా జాగృతిని ప్రారంభించారు. ఈ సంస్థకు మెల్బోర్న్ వాస్తవ్యులు శ్రీ శశిధర్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారని శ్రీమతి కవిత గారు పేర్కొన్నారు. ఇతర నగరాల్లో కార్యదర్శులను కూడా ఎంపిక చేయడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీమతి కవిత మాట్లాడుతూ భారత ఆస్ట్రేలియా సంబంధాలు మెరుగుపడడానికి ఇరు దేశాల ప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారని ఈ ప్రక్రియలో భాగంగా ఇక్కడ నివసిస్తున్న తెలంగాణా ప్రజలు మరియు వ్యాపార సంస్థలు కూడా ఎక్కువగా కృషి చేస్తే ఆర్ధిక వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం అయి ఇరు దేశాలు దీర్ఘకాలం సత్సంబందాలు కలిగి ఉండడానికి దోహదపడుతుందని చెప్పారు.

హైదరాబాదు నగరం భారత దేశంలో ఉత్తమ నగరంగా ఎంపికైందని మెల్బోర్న్ నగరంలా తీర్చి దిద్దటానికి ప్రయత్నిస్తామని కవిత గారు తెలిపారు. రెండేళ్ళ క్రితం వరకు అరవై ఏళ్ల కలను సాకారం చేసుకోవాలన్న తపనతో అందరూ ఎంతో కృషి చేసి రాష్ట్రాన్ని సాధించాం. అయితే ఇప్పుడు పంథా మరి తెలంగాణా రాష్ట్రాన్ని నవ తెలంగాణగా పారిశ్రామిక, ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక రంగాల్లో ప్రపంచ పటంలో చిత్రీకరించాలన్న తపనతో పని చేస్తున్నట్లు కవితగారు చెప్పారు.

ఆస్ట్రేలియా భారత సంబంధాల గురించి ప్రస్తావిస్తూ రెండు దేశాలూ బహుళ సంస్కృతీ సత్సాంప్రదాయాలకు వారసులని అదే పరంపర కొనసాగిస్తూ ఈ దిశలో ఎంతో కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భువన విజయ సభ్యుడు శ్రీ మురళి ధర్మపురి గారి వెబ్సైటు “మురళి ముషాయిరా”  (www.murali-mushayira.com) శ్రీమతి కవిత గారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు సంస్థల అధినేతలే కాకుండా చాలామంది విక్టోరియా పార్లమెంట్ సభ్యులు మరియు ఇతర భారతీయ సంస్థల అధినేతలు కూడా రావడం జరిగింది. ఇతర రాష్ట్రాలనుండి కూడా తెలంగాణా జాగృతి ప్రతినిధులు వచ్చారు.

మెల్బోర్న్ తెలంగాణా ఫోరం బతుకమ్మ పోస్టర్ ని శ్రీమతి కవిత గారు ఈ కార్యక్రమంలో ఆవిష్కరించడం జరిగింది.

97720270_n

Send a Comment

Your email address will not be published.