ఆస్ట్రేలియా – ఆంధ్ర ప్రదేశ్ నూతన వారధి

ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి నూతన శకానికి నాంది పలికిన సందర్భంగా విందం వేల్ సిటీ కౌన్సిలర్ శ్రీ గౌతమ్ గుప్త గత నెల భారత దేశం సందర్శించినపుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణా ఐ టి మంత్రి శ్రీ కె టి రామారావు గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల పునః నిర్మాణానికి ఆస్ట్రేలియా లోని భారతీయ సంతతికి చెందిన వారు ముఖ్యంగా తెలుగువారు ఎలా తోడ్పడతారు అన్న విషయంపై చర్చలు జరిపారు. అంతే కాకుండా ఆస్ట్రేలియాలోని సాంకేతిక పరిజ్ఞానం ఈ రెండు రాష్ట్రాల పురోభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందనేది ఈ చర్చల్లో చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల ముఖ్య మంత్రులను శ్రీ గుప్తా ఆస్ట్రేలియా పర్యటనకు ఆహ్వానించారు. విందం వేల్ పరిసర ప్రాంతాల్లో ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ఎక్కువ మంది నివసించడం గమనార్హం. ఆస్ట్రేలియా – ఆంధ్ర ప్రదేశ్ ల మధ్య ఇదొక నూతన శకం కాగలదని శ్రీ గుప్తా ఆశాభావం వ్యక్తం చేసారు.

Send a Comment

Your email address will not be published.