ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం - బతుకమ్మ

ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం  - బతుకమ్మ

“మా టివి” యాంకర్ రవి భారతదేశం నుండి వచ్చి ఆస్ట్రేలియా తెలంగాణా తెలుగు సంఘం బతుకమ్మ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే మధ్యాహ్న భోజనానికి భారత దేశం నుండి తీసుకువచ్చిన ప్రత్యేకమైన తెలంగాణా వంటకాలు వచ్చిన వారందరికీ ఇవ్వటం. భళే రుచైన వంటకాలు అందరికీ మరింత నోరూరించాయి. ముందు రోజు రవి మెల్బోర్న్ లో నివసించే తెలుగు అడపడుచులతో వంటల కార్యక్రమం షూటింగ్ కూడా చేయడం జరిగింది. బతుకమ్మ పండగలో సాధారణంగా జరిగే ఆడపడుచుల పాటల ప్రదక్షిణతో పాటు చాలామంది చిన్న పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా నృత్య ప్రదర్శన చేయడం ప్రత్యేకం.

హాపర్స్ క్రాసింగ్ లోని సెంట్రల్ పార్క్ కమ్యూనిటీ హాలులో ఈ నెల 27 వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి షుమారు 600 మంది హాజరై పండగ వాతావరణాన్ని కనులపండువుగా సృష్టించడం జరిగింది.

కార్యవర్గ అధ్యక్షులు శ్రీ వుల్పాల రాజవర్ధన రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా పల్లెల్లో ముఖ్యంగా వరి నాట్ల కాలంలో స్త్రీలు ఎంతో ప్రయాసలకు గురై అలసి పోయి ఉండటం, ఈ ఉత్సవం సేద దీర్చుకోవడానికి మంచి సదవకాశం ఇస్తుందని చెప్పారు. అంతే కాకుండా గృహిణి ఇంటికి ఎంత ముఖ్యమో స్త్రీ సామూహిక శక్తి ఊరికి అంతే ముఖ్యం. ఈ పండగ ద్వారా స్త్రీల మధ్య ఐకమత్యం పెంపొంది పల్లెకు మరింత శోభనిస్తుందని శ్రీ రెడ్డి గారు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.