ఆస్ట్రేలియా రేడియో శబ్ద తరంగాలలో శ్రీ కృష్ణ రాయబారం

OLYMPUS DIGITAL CAMERA
OLYMPUS DIGITAL CAMERA

తెలుగు మల్లి మరియు భువన విజయం గత ఉగాది సందర్భంగా నిర్వహించిన శ్రీ కృష్ణ రాయబారము నాటకము అత్యంత ప్రాచుర్యం పొంది ఇప్పుడు రేడియో శబ్ద తరంగాలలో సైతం తన ఉనికిని చాటుకుంటుంది.  శ్రీ కృష్ణ రాయబారము కాల పరిమితి లేనిదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తెలుగు నాటక రంగంలో శ్రీ తిరుపతి వేంకట కవులు వ్రాసిన ఉద్యోగ పర్వంలోని శ్రీ కృష్ణ రాయబారము భారత దేశపు ఎల్లలు దాటి ప్రపంచంలోని నలుమూలలా ప్రదర్సింపబడడం తెలుగువారికి గర్వకారణం.

నిన్న బ్రిస్బేన్ రేడియోలో తెలుగు భాషాభిమాని, కళాకారుడు, నటుడు మరియు రేడియో వాచస్పతి అయిన శ్రీ శ్రీకృష్ణ రావిపాటి గారు మన శ్రీకృష్ణ రాయబారము నాటకము గురించి షుమారు 12 నిముషాలు మాట్లాడారు.  హృదయం కదిలించే వారి వ్యాఖ్యానానికి ధన్యవాదములు.  వారు మనందరి గురించి ఈ క్రింది లింకుని పంపించారు.  మీరందరూ విని ఆనందించగలరని మనవి.

https://drive.google.com/file/d/0BxgMC08FRAyGUUl3akQwbmZYZFk/view?usp=docslist_api

బ్రిస్బేన్ రేడియో కార్యక్రమం ప్రతీ శనివారం ఉదయం 9:30 (బ్రిస్బేన్ కాలం ప్రకారం) గంటలకు 98.1 FM రేడియో తరంగాలపై  (http://www.4eb.org.au/) వినవచ్చు.

సిడ్నీ రేడియో జనరంజని వారు వచ్చే రెండు వారాలు (5 మరియు 12 తేదీలు)  ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ప్రసారం చేస్తున్నారు. శ్రీ దూర్వాసుల మూర్తి గారికి మరియు జనరంజని మిత్ర బృందానికి మా హార్దిక శుభాభినందనలు.

ఈ ప్రసారాన్ని http://janaranjani.com.au/ లో ప్రతీ సోమవారం రాత్రి 8:30 నిమిషాల నుండి 9:30 నిమిషాల వరకు వినవచ్చు.

21 వ శతాబ్దంలో ప్రపంచమంతా ఐ ఫోన్లు, అంతర్జాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న సమయంలో ఆణిముత్యంలాంటి శ్రీకృష్ణ రాయబారము నాటకాన్ని ఆదరించేవాళ్ళు, ఆస్వాదించేవాళ్ళు కోకొల్లలు అనడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం.

ఈ నాటకం యధాతధంగా యు ట్యూబ్ లో కూడా మీరు తిలకించవచ్చు.

https://www.youtube.com/watch?v=MBy7GAVLufI