ఆ చిత్రానికి 56 ఏళ్ళు..

తెలుగులో తొలి టాకీ చిత్రం ప్రారంభమైంది 1931 లో. ఆ నేపద్యంలో రాజమండ్రిలో దుర్గా సినీ టోన్, విశాఖపట్నంలో మరొక స్టుడియోలోను, హైదరాబాదులో సదరన్ మూవీ టోన్ స్టూడియో మొదలయ్యాయి. వీటిలో కొన్ని చిత్రాలు నిర్మించారు కూడా. కానీ ఈ స్టూడియోలు ఎక్కువ కాలం సాగలేదు.

ఇంతలో ఒక జమిందారు హైదరాబాదులోని అమీర్ పేటలో ఒక పురాతన భవనాన్ని కొనుగోలు చేసి అక్కడ సారధి స్టూడియో నిర్మాణపు పనులు ప్రారంభించారు. ఆ నిర్మాణం 1956 లో పూర్తి అయ్యింది. ఇంతకూ ఆ స్టూడియో నిర్మించింది ఎవరో చెప్పలేదు కదూ..? ఆ జమిందారు పేరు రామకృష్ణ ప్రసాద్. ఈ స్టూడియో లో మూడు ఫ్లోర్లు, రికార్డింగు థియేటర్, బ్లాక్ అండ్ వైట్ ల్యాబ్, తదితర సౌకర్యాలు ఉండేవి. ఇక్కడ ఎన్నో చిత్రాల రికార్డింగ్ పనులు జరిగాయి.

ఈ స్టూడియో లో నిర్మించిన మొట్టమొదటి చిత్రం పేరు మా ఇంటి మహాలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత నవశక్తి పర్వతనేని గంగాధర రావు. ఆ చిత్రానికి దర్శకులు గుత్తా రామినీడు. 1959 లో దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో జమున, హరనాథ్, గుమ్మడి, రమణా రెడ్డి తదితరులు నటించారు. దీనిని పంపిణీ చేసిన సంస్థ నవశక్తి ఫిల్మ్స్. 1959 లో ఇది విడుదల అయ్యింది. ఈ చిత్రానికి ఉత్తమ ఫీచర్ ఫిలిం గా జాతీయ స్తాయిలో అవార్డు లభించింది.  హరనాథ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఇది.

Send a Comment

Your email address will not be published.