ఇండియన్ సన్ “పర్సన్ అఫ్ ది ఇయర్”

పరదేశంలో తెలుగువారి కీర్తి మరొకసారి పరవశించింది. ఆస్ట్రేలియా గడ్డపై మరో తెలుగు తేజం గుర్తింపబడింది. “కష్టే ఫలి” అన్న నినాదం నిరూపించబడింది. భారతీయ సాంప్రదాయంలో హిందుత్వం ఒక భాగమనే నమ్మకం. అదే ధ్యాసతో భారత దేశంలో పయనం. 22 ఏళ్లుగా విదేశీ గడ్డపై ముందుకు సాగిన వైనం. ఈ ప్రయాణంలో అందుకున్న “ఇండియన్ సన్ పర్సన్ అఫ్ ది ఇయర్” పురస్కారం.

శ్రీ నూకల వెంకటేశ్వర రెడ్డి గారు ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో చిర పరిచితులే. వీరి తాత గారు మాజీ రెవిన్యూ శాఖామాత్యులు శ్రీ నూకల రామచంద్రా రెడ్డి గారు. 1980 దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పట్టా పుచ్చుకొని విద్యార్ధి దశ నుండే సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక విద్యార్ధి సంఘాలతో అనుబంధం ఏర్పరచుకొన్నారు. చిన్నప్పటి నుండీ విశ్వ హిందూ పరిషత్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో క్రమశిక్షణతో పెరిగి తోటి వారికి సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు.

శ్రీ వెంకట్ గారు తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా వాస్తవ్యులు. 1994 లో న్యూ జిలాండ్ దేశానికి వలస వెళ్లి న్యూ జిలాండ్ తెలుగు సంఘం వ్యవస్థాపక ఉపాధ్యక్షులుగా పని చేసారు. న్యూ జిలాండ్ లో కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని హిందూ మత ప్రచారానికి ఎంతో కృషి చేసారు.

2010 సంవత్సరంలో వారి స్వగ్రామం చిల్లంచెర్లలో షిర్డీ సాయి మందిరం నిర్మించడానికి తన చిన్ననాటి స్నేహితుల సహాయంతో షుమారు 20 లక్షలు రూపాయలు పోగు చేసి మందిర నిర్మాణం పూర్తి చేసారు.

2000 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశం వచ్చి తనదైన శైలిలో సంఘ సేవ చేస్తూ 2013లో “మెల్బోర్న్ తెలంగాణా ఫోరం” సంస్థాపక అధ్యక్షులుగా రెండేళ్ళు పని చేసారు. ప్రస్తుతం మెల్బోర్న్ తెలంగాణా ఫోరం కి సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా తెలంగాణాలో ప్రసిద్ధమైన పండగలు “బతుకమ్మ” మరియు “బోనాలు” మెల్బోర్న్ నగరంలో ప్రతీ ఏటా నిర్వహించి బహుళ ప్రచారానికి దోహదపడ్డారు.

విందం దివాళీ సంస్థలో కార్యనిర్వహణ సభ్యునిగా గత 5 సంవత్సరాలుగా ఉంటూ ప్రతీ ఏటా దివాళీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి షుమారు 35, 000 మంది హాజరౌతుంటారు. మెల్బోర్న్ నగరంలో ఈ కార్యక్రమానికి చాలామంది ఎదురుచూస్తూ వుంటారు.

శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారి సతీమణి శ్రీమతి లక్ష్మి గారు సర్వదా సహాయ సహకారాలందిస్తూ తాను చేపట్టే ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటారు.  వీరికి ఇరువురు మగ పిల్లలు.  కుటుంబ సభ్యులందరూ తాను ఈ అవార్డు ఎంపిక కావడానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

శ్రీ వెంకట్ గారు ఆస్ట్రేలియా భారతీయ విద్యార్ధి సంఘానికి వ్యవస్థాపక సభ్యులు మరియు సలహా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తమ సేవల్ని మన తెలుగువారి కోసం కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు అందుకోవాలని తెలుగుమల్లి ఆశిస్తోంది.

శ్రీమతి ప్రతిమ శాస్త్రి – “యంగ్ యచీవార్ అఫ్ ది ఇయర్”
ఇండియన్ సన్ “యంగ్ యచీవార్ అఫ్ ది ఇయర్” గా తెలుగువారైన శ్రీమతి ప్రతిమ శాస్త్రి గారు ఎంపిక కావడం ముదావహం. శ్రీమతి ప్రతిమ గారు ప్రముఖ పండితులు యుగ కవి గా పేరొందిన నెల్లూరు వాస్తవ్యులైన శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారి మనవరాలు. వారసత్వ పరంపరను కొనసాగిస్తూ హిందూస్తానీ సంగీతంలో నాలుగేళ్ళ వయసునుండే తర్ఫీదు పొంది కాశ్మీరీ పండితు