ఇక నగర పాలక ఎన్నికలు

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఎన్నికలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర విభజన తరువాత మొదటిసారిగా జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నగరంలో డివిజన్ల పునర్విభజన, బీసీ వోటర్ల గుతింపు, అక్రమ వోటర్ల తొలగింపు వంటి ప్రక్రియల ప్రారంభంతో ఇప్పటికే నగరంలో ఎన్నికలు, రాజకీయ వేడి పుంజుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచించడం మొదలైపోయింది. నగరాన్ని 150 డివిజన్లుగా విభజించారు. ఎనభై లక్షల మందికి పైగా వోటర్లు ఉన్నారు. జనవరి 31 లోపు నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, జనవరి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

Send a Comment

Your email address will not be published.