ఇక 25 జిల్లాలు

తెలంగాణాలో 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సారధ్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 జిల్లాలున్నాయి. వీటిని  పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త జిల్లాల్లో సికందరాబాద్ కూడా ఒక జిల్లా కాబోతోంది. భువనగిరిని కూడా జిల్లాగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణా ఆవిర్భావ దినిత్సవం రోజున ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు తగ్గట్టుగా 44 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు అవసరమవుతారని కేంద్రానికి సూచించింది. కేంద్రం ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అప్పుడే అధికారులు కసరత్తు ప్రారంభించారు.

Send a Comment

Your email address will not be published.