ఇద్దరు చంద్రులు కలుసుకున్న శుభవేళ

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కలుసుకుని, కరచాలనం చేసుకున్నారు. ఎటువంటి సందర్భంలోనూ ఎదురుపడని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు, శనివారం హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలకడానికి బేగం పేట్ విమానాశ్రయానికి పరస్పరం పలకరించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తరువాత రాష్ట్రపతి నగరానికి రావడం ఇదే మొదటిసారి. చంద్రశేఖర్ రావు, చంద్రబాబు ముఖాముఖి కలుసుకోవడం కూడా ఇదే మొదటిసారి.

మొక్కుబడిగానో, ముక్తసరిగానో కాకుండా ఈ ఇద్దరూ పాత మిత్రుల్లా ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. కేసీ ఆర్ ముందే విమానాశ్రయానికి చేరుకోగా, గవర్నర్ నరసింహన్ ఆ తరువాత వచ్చారు. ఆ తరువాత చంద్రబాబు చేరుకున్నారు.

కీసీఆర్ ముందుకు వెళ్లి చంద్రబాబుతో కరచాలనం చేశారు. పక్కనే ఉన్న గవర్నర్ వెంటనీ ఆ చేతుల్ని మరింత గట్టిగా పట్టుకున్నారు. ఇది చూసిన వారంతా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ తరువాత చంద్రబాబు కీసీఆర్ భుజం తట్టారు.

ఒకప్పుడు సన్నిహితంగా పని చేసిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన తరువాత బద్ధ శత్రువులుగా మారిన విషయం తెలిసిందే.

Send a Comment

Your email address will not be published.