ఉక్కు ఇందిరా....

– ఇందిరా గాంధి అలహాబాదులో 1917 నవంబర్ 19 న జన్మించారు. ఆమె పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని గాంధి.
– భారతదేశ ప్రదం ప్రధాని ఏకైక కుమార్తె ఇందిరా గాంధి. ఆమెను భారత దేశపు ఉక్కు మహిళగా వినుతికెక్కారు. ఆమె తల్లి కమలా నెహ్రూ.
– స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత ఇందిరా గాంధి 1934-35 ప్రాంతంలో శాంతినికేతన్ లో చేరారు. అనంతరం ఆమె ఇంగ్లాండ్ వెళ్లి 1937 లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిధిలోని సోమర్ విల్లె కాలేజీలో చేరారు. 1941 లో ఇంగ్లాండ్ నుంచి భారత దేశానికి వచ్చిన తర్వాత ఆమె తన తండ్రి జవహర్ లాల్ నెహ్రూ కి పర్సనల్ అసిస్టెంటుగా తోడ్పడ్డారు.
– తల్లి కమలా నెహ్రూ మరణం తర్వాత ఆమె పూర్తిస్థాయిలో తండ్రి వెంటే పర్యటిస్తూ ఉండేవారు. అంతే కాదు, ఆమె దేశానికి మొదటి మహిళా ప్రధాని కూడా అయ్యారు.
– 1942 మార్చి 26వ తేదీన ఆమె పార్సీ అయిన ఫిరోజ్ గాంధీని వివాహమాడారు. ఫిరోజ్ గాంధి రాజకీయవేత్త. పాత్రికేయుడు కూడా. ఇందిరా వివాహాన్ని హైందవ చాందసవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. కారణం ఆమె అన్యమతస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. పెద్దలు సంబంధం చూసి చేసిన పెళ్లి కాదు. తండ్రి జవహర్ లాల్ నెహ్రు కూడా ఈ పెళ్ళికి ఇష్టం లేదు. కారణం, ఇద్దరి వ్యక్తిత్వాలు ఏ కోసానా కలవవని ఆయన అభిప్రాయం.
– ఇందిరాగాంధీ దంపతులకు ఇద్దరు కుమారులు. వారు సంజయ్ గాంధి, రాహుల్ గాంధి.
– 1964 లో జవహర్ లాల్ నెహ్రూ మరణించిన తర్వాత ఇందిరా గాంధి రాజ్య సభ సభ్యులుగా నియమితులయ్యారు. లాల్ బహదూర్ మంత్రివర్గంలో ఆమె సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
– 1966 లో ఆమె దేశ ప్రధాని అయ్యారు. 1977 వరకు ఆమె వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా కొనసాగారు.
-ఆ తర్వాత 1980 వ సంవత్సరంలో నాలుగోసారి దేశ ప్రధానిగా ఎన్నికై 1984 లో తుదిశ్వాస విడిచే వరకు ప్రధానిగా ఉన్నారు.
– ఆమెను బ్రిటీష్ పాలకులు 1942 సెప్టంబర్ 11న అరెస్టు చేసి 1943 మే 13 వరకు దాదాపు పదమూడు నెలలు అలహాబాదులోని నైనీ సెంట్రల్ జైలులో బందీగా ఉంచారు.
– 1971 లో ఆమె పాకిస్తానుపై యుద్ధం ప్రకటించారు. ఆ పోరులో భారత దేశం గెలిచింది. ఈ క్రమంలోనే ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అనే దేశం పుట్టుకొచ్చింది.
– ఆమెకు ధీరేంద్ర బ్రహ్మచారి యోగా గురువుగా ఉండేవారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఇందిరా గాంధికి సహకరించారు.
– దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ విధించిన ఏకైక ప్రధాని ఇందిరా గాంధి. 1975 జూన్ 25 వ తేదీ నుంచి 1977 మార్చి 21 వరకు దేశంలో ఎమర్జెన్సీ కొనసాగింది. లోక్ సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్టు అలహాబాద్ హై కోర్ట్ తీర్పు ప్రకటించినప్పుడు ఆమె ఎమర్జెన్సీ విధించారు.
– 1975 లో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇందిరా గాంధి ఓటమి చవిచూశారు.
– 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధి అంగ రక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ తమ సర్వీస్ ఆయుధాలతో ఆమెను కాల్చి చంపారు. డిల్లీ లోని సఫ్దర్ జంగ్ రోడ్ లోని ప్రధాని నివాసంలోని వనంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కన్నుమూసారు. ఈ కాల్పుల కుట్రలో నిందితుడిగా కేహార్ సింగ్ ని అరెస్ట్ చేసారు. బియాంత్ సింగ్ ను కాల్చి చంపగా సత్వంత్ సింగ్, కేహార్ సింగ్ లకు ఉరిశిక్ష విధించారు. డిల్లీ లోని తీహార్ జైలులో వీరిద్దరినీ ఉరి తీసారు.
1984 నవంబర్ మూడో తేదీన రాజ్ ఘాట్ సమీపంలో ఇందిరా గాంధి అంత్యక్రియలు జరిగాయి.
– ఆమె ప్రవర్తన నచ్చక శాంతినికేతన్ నుంచి విశ్వకవి రవీంద్ర నాథ్ బయటకు పంపించేసారు.; అలాగే ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కూడా నాన్ పెర్ఫార్మన్స్ వల్ల బయటకు రావలసి వచ్చింది.
-శాంతినికేతన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒంటరి అయ్యారు. తండ్రి రాజకీయాలలో బిజీగా ఉండటం, తల్లి అనారోగ్యంతో స్విట్జర్ లాండులో అంతిమదశలో ఉండటంతో ఆమె ఏకాకి అయ్యారు. అలహాబాదులో మోతీలాల్ నెహ్రు కుటుంబీకులకు వైన్ వంటివి సమకూర్చిపెట్టే నవాబ్ ఖాన్ కుమారుడు ఫిరోజ్ ఖాన్ కు ఆమె దగ్గరయ్యారు. అప్పుడు మహారాష్ట్రా గవర్నర్ గా ఉన్న డాక్టర్ శ్రీప్రకాశ్ జవహర్ లాల్ నెహ్రూతో ఇందిరా వ్యవహారం చెప్పి హెచ్చరిక చేసారు. ఫిరోజ్ ఖాన్ తో ఇందిరా గాంధి సంబంధాలు ఆయనకు నచ్చలేదు. ఫిరోజ్ ఖాన్ తో సన్నిహిత సంబంధాల వ్యవహారం బయటకు పొక్కడంతో ఆమె మతం మార్చుకున్నారు. ఆమె ముస్లిం మహిళగా మారారు. లండన్ లోని ఒక మసీదులో ఫిరోజ్ ఖాన్ ను ఇందిరా గాంధి పెళ్లి చేసుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని తన పేరును మైమునా బేగంగా పేరు మార్చుకున్నారు. వీరి పెళ్ళికి తల్లి కమలా నెహ్రూ వ్యతిరేకించారు. కూతురు ముస్లిం మతస్తురాలిగా మారడం నెహ్రూ కి కూడా నచ్చలేదు. ఆమె భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశాలు ఇబ్బందుల్లో పడతాయని ఆయన ఆలోచించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నెహ్రూ ఫిరోజ్ ఖాన్ ను తన ఇంటి పేరుని గాంధీగా మార్చుకోమని కోరారు. ఫిరోజ్ గాంధి సరేనని ఒప్పుకోవడంతో పేరు మార్పుకోసం ఒక అఫిడవిట్ సమర్పించారు. దానితి ఫిరోజ్ ఖాన్ కాస్తా ఫిరోజ్ గాంధి అయ్యారు. అనంతరం ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధి భారత దేశం వచ్చిన తర్వాత జనాన్ని మెప్పించడం కోసం హిందువుల పద్ధతిలో వారికి మళ్ళీ పెళ్లి చేయించారు.
– ఇందిరా గాంధి కుమారుల్లో ఒకరైన సంజయ్ అసలు పేరు సంజీవ్. ఇంగ్లాండులో ఒకసారి కారు చోరి చేసిన కారణంగా బ్రిటీష్ పోలీసులు సంజీవ్ ని అరెస్టు చేసి పాస్ పోర్ట్ సీజ్ చేసారు.
– ఇందిరా గాంధి ఆజ్ఞ మేరకు ఇంగ్లాండులో ఉన్న అప్పటి భారత రాయబారి కృష్ణ మీనన్ అధికార దుర్వినియోగంతో సంజీవ్ పేరుని సంజయ్ గా మార్పు చేసి కొత్త పాస్ పోర్ట్ వచ్చేటట్టుగా చేసారు. ఈ విధంగా సంజీవ్ కాస్తా సంజయ్ గాంధీ అయ్యారు. సంజయ్ గాంధి ఇందిరా గాంధి, ఫిరోజ్ ఖాన్ దంపతులకు పుట్ట లేదని, ఇందిరాగాంధీకి మరో ముస్లీం మొహమ్మద్ యూనస్ వల్ల పుట్టిన కుమారుడని “ది నెహ్రు డైనస్టీ” అనే పుస్తకంలో ఉంది. ఆ పుస్తకాన్ని కె ఎన్ రావు అనే ఆయన రాసారు. సంజయ్ గాంధి, మేనకల వివాహం మొహమ్మద్ యూనస్ నివాసంలో జరగడం గమనార్హం. ఈ పెళ్లి మొహమ్మద్ యూనస్ కు ఇష్టం లేదు. ఎందుకంటె సంజయ్ గాంధీకి ఒక ముస్లిం యువతితో పెళ్లి జరిపించాలని ఆయన కోరిక. సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు మొహమ్మద్ యూనస్ ఎవరూ పట్టలేనంతగా ఏడ్చారు. సంజయ్ గాంధి మరణించిన వార్త తెలియడంతోనే ఇందిరా గాంధి వేసిన మొదటి ప్రశ్న ఇదే….”సంజయ్ గాంధి తాళాలు, రిస్ట్ వాచ్ ఎక్కడ ఉన్నాయి?” అని.
– రాజీవ్ గాంధి పుట్టిన తర్వాత ఇందిరా గాంధి, ఫిరోజ్ గాంధి విడాకులు తీసుకోకపోయినా కొన్ని కారణాల వల్ల వేర్వేరుగా నివసించారు. సానియా మాయినో (సోనియా గాంధి అసలు పేరు)ని పెళ్లి చేసుకోవడం కోసం రాజీవ్ గాంధి కాథలిక్ గా మారారని కె ఎన్ రావు రాసిన “ది నెహ్రు డైనస్టీ” అనే పుస్తకంలో ఆరోపించారు. రాజీవ్ గాంధి కుమార్తె అసలు పేరు బియాంకా. అయితే ఆ తర్వాత బియాంకా కాస్తా ప్రియాంకా అయ్యారు. డాక్టర్ సుబ్రమణ్య స్వామీ రాస్తూ సోనియా అసలు పేరు ఆంటోనియా మాయినో గా పేర్కొన్నారు. హై స్కూల్ విద్య తర్వాత సోనియా చదువుకోలేదు. ఇంగ్లీషు టీచింగ్ కేంద్రం నుంచి (లెనాక్స్ స్కూల్) ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఆమె కేంబ్రిడ్జ్ టౌన్ లోని ఒక రెస్టారంట్ లో పని చేసారు.

సేకరణ : యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.