ఉగాది ! ... యుగాది ! ...

కాలమానం ప్రకారం ఈ ధరాథలం ఫైనున్నభరత ఉపఖండంలో్ ఫాల్గుణ మాసాంతంలో శిశిర ఋతువునిష్క్రమిస్తుంది. చైత్రమాసంలో వసంత ఋతుఆగమనం ప్రారంభమవుతుంది. ఇతర ఖండాల్లోఋతుక్రమావళి మనదేశానికి భిన్నంగా వుంటుంది. అది యాదృచ్చికంకాదు. భూగోళంఫై ఆయా ఖండపరిధుల స్థితిగతులననుసరించి వాతావరణంలో మార్పులు జరుగుతూ వుంటాయి.

“ఉగ” అనగా నక్షత్ర గమనం. ఆ నక్షత్ర గమనానికి ‘ఆది’ ‘ఉగాది’ ! సృష్టిలోని నక్షత్ర గమనాన్ని అనుసరించి యుగారంభం అయిందనీ అదే యుగాది అనబడిందనీ వేదాలు తెలిపాయి. మనదేశంలో వసంత ఋతువు ప్రారంభం కాగానే నేల చిగురిస్తుంది. దాంతో పచ్చదనం విచ్చుకుంటుంది. ఆ రకంగా కొత్తయుగానికి నాంది పలికినట్లవుతుంది. ‘యుగానికి నాంది’ అను భావంతో కూడా ‘యుగాది’ పదం ఉద్భవించి వుండవచ్చునని పండితాభిప్రాయం. ఎందుకంటే ఆ పదంలోని ‘ఆది’ అనగా ‘ఆరంభం’ అని అర్థం. యుగారంభానికి ఆదిదినం కాబట్టే ‘యుగాది’ అని వారంటున్నారు. అందుకే అనాది కాలంనుంఛి ఆ ‘యుగాది’ పదానికి పర్యాయ పదంగా ‘ఉగాది’ రూపు దిద్దుకుని వుండవచ్చునన్నభావం సర్వజన అభిప్రాయంగా కొనసాగుతోంది.

యావత్భారతదేశం ఉగాదిని ఓ పర్వదినంగా భావిస్తుంది. తెలుగు వారొక్కరికే ‘ఉగాది’ పండుగ పరిమితం కాలేదు. ఈ దినాన్నిమన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పిలుస్తారు. బెంగాలీయులు ఈ పండగని ‘పాయిల’గా, అస్సామీలు ‘భిహు’ గా మహారాష్ట్రీయులు ‘గుడిపాడ్వ’గా, యితర ఉత్తర రాష్ట్రాల్లో ‘నవ వర్ష’గా, కాశ్మీర్లో ‘నవ్రేశీగా’ ఈ పండుగని పిలవటం జరుగుతోంది. అయితే దక్షిణభారతంలో మాత్రం మన తెలుగువారితో బాటుగా కన్నడీయులు కూడా ఈపర్వదినాన్న’ఉగాది’గానే సంభోధిస్తారు. కాని తమిళులు మాత్రం ఈ శుభదినాన్ని’పుతండు’గా పిలుస్తారు. కేరళ రాష్ట్రంలో ఈ పండుగని ‘విష్ణు’ అంటూ జరుపుకుంటారు.

కేరళీయులు విష్ణువు పేరిట ఈ పండుగని నిర్వహించడానికో అర్థం వుంది. దశావతారాల్లోని విష్ణుమశ్చ్యావతారానికి ఈ పండుగతో సంభంధం వుందని వారి విశ్వాసం! శ్రీ మహావిష్ణువు చైత్ర శుద్ధ పాడ్యమినాడే మశ్చ్యావతారాన్ని ధరించాడు. వేదాల్ని హరించిన సోమకుడనే దానవుణ్ని సంహరించటం కోసమే ఆయన ఈ అవతారాన్ని ధరించాల్సి వచ్చింది.

అదేఅనుక్రమణికలోపౌరాణికంగా శ్రీరామచంద్రుడు చైత్ర మాసారంభంలోనే అవతరించాడు. చారిత్రకంగావిక్రమాదిత్యుడు ఉగాదినాడే పట్టాభిషిక్తుడయ్యాడు. అందుకే ఈ పండుగకి అంత విశిష్ఠత చేకూరింది. అంతేకాకుండా ఈ ఉగాది పండుగ పుట్టుక గురించి మరెన్నో పురాణ గాథలు ప్రచారంలో వున్నాయి.

అయితే బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాల గణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది నిర్వివాదాంశం.

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాదిరోజునాడు మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆరోజున ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమం ఓ నిర్ణీత ఆనవాయితిగా కొనసాగుతోంది . పల్లెల్లో కూడా రైతులు ఆరోజున దేవాలయం వద్దకి చేరి, పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది …ఏరువాక ఎప్పుడు కొన సాగాలి? అను విషయాల్ని అడిగి తెలుసుకుంటారు.

ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం “ఉగాది పచ్చడి”. ఆవంటకం షడ్రుచుల సమ్మేళనం! అనగా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన పచ్చడి ఉగాది పచ్చడి. ఈ పండుగ సందర్భంగా సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్ని యివ్వటం మాత్రమె ఈ పచ్చడి సేవన ఆచారంగా భావించబడుతోంది.
ఆరుపదుల తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’తో మొదలుపెట్టి ‘అక్షయ’నామ సంవత్సరము వరకు వివరించబడ్డాయి. అదే వరుసలో మనిషంటూ పుట్టాక అరవయిఏళ్ళు బ్రతకటం అను భావం కూడా చాలా విశేష స్థితిని సృష్టించింది. అందుకే సామాన్య జన జీవితంలో వారు చేసుకున్న సుకృత పరంగా అరవయి సంవత్సరాలు పూర్తి కాగానే ఆరోజుని ఒక పర్వదినంగా భావించబడి ఆ జీవన గమన స్థితిపరంగా ‘షష్ఠిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

అదే ఉద్దేశ్యంతో కాబోలు షష్ఠిపూర్తి పండుగని విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా జరుపుకుంటూ వుంటారు. ఏమయితేనేమి తెలుగువారికి మాత్రం జాతిసంస్కృతీపరంగా ‘ఉగాది’ కొత్త సంవత్సరంలోని మొదటి పండుగ దినంగా కొనసాగుతోంది.

SP Chari

Send a Comment

Your email address will not be published.