ఉత్తమ తెలుగు చిత్రం చందమామ కథలు

భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల పర్వంలో జాతీయ అవార్డులకు ఓ ప్రత్యేకస్థానం ఉంది. 2014 సంవత్సరానికి గాను తాజాగా సినీ రంగానికి సంబంధించి జాతీయ అవార్డులను అవార్డు కమిటీ ప్రకటించింది.

ఈ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘చందమామ కథలు’ సినిమా ఎంపికైంది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఏర్పడిన ‘చందమామ కథలు’ సినిమా గత ఏడాది విడుదలై పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాయే జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవ్వడం గమనార్హం.

చందమామ కథలు సినిమాకు ఎనిమిది భిన్న నేపథ్యాల్లోని ఎనిమిది కథలు మూలం. ఆ కథలను ఓ చిత్రంగా రూపొందించడం విశేషం. ఎనిమిది ప్రపంచాల కథలను ఒకే కథలా నడిపించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. భావోద్వేగాలను, సున్నితమైన కథనంగా మలచి తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రతిభను హ్యాట్సాఫ్.

ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సందర్భంగా, చందమామ కథలు సినిమా యూనిట్ కు తెలుగుమల్లి అభినందనలు.

ఇక ఇతర అవార్డుల విషయానికి వస్తే,
“క్వీన్సి” సినిమాలో గొప్ప నటన ప్రదర్శించిన నటి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన ముందు రోజే ఆమె పుట్టిన రోజు జరుపుకుంది. జాతీయ స్థాయిలో ఆమెకు పురస్కారం లభించడం ఇది రెండో సారి. గతంలో ఫ్యాసన్ అనే చిత్రంలో ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది.

“హైదర్” అనే హిందీ చిత్రానికి అయిదు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ.

ఉత్తమ నేపధ్య సంగీతం అవార్డు గోపిసుందర్ (1983, మలయాళం), ఉత్తమ గీత రచన ఎన్ ఎ ముత్తుకుమార్ (తమిళ చిత్రం శైవం), ఉత్తమ నేపధ్య గాయని అవార్డు ఉత్తర ఉన్నికృష్ణన్ (తమిళ చిత్రం శైవం), ఉత్తమ సహాయ నటుడు బాబీ సింహా (తమిళ చిత్రం జిగార్తాండా), ఉత్తమ సహాయ నటి అవార్డు బాజిందర్ కౌర్ (హర్యానా చిత్రం పగిడి ద ఆనర్), ఉత్తమ నూతన దర్శకుడి అవార్డు (ఇందిరాగాంధీ పురస్కారం) ఆదిత్య విక్రం సేన్ గుప్తా (ఆశాజావోర్ మాజే బంగా), ఉత్తమ చిన్నారుల చిత్రంగా కాక్కా ముట్టై (తమిళం), ఎలిజబెత్ ఏకాదశి (మరాటీ), ఉత్తమ బాల నటులుగా విఘ్నేశ్, రమేష్ ఆయా విభాగాల్లో జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారు.

Send a Comment

Your email address will not be published.