ఎట్టకేలకు నంది బహుమతులు!

ఈగకు తొమ్మిది అవార్డులు
———————————-
2012, 2013 సంవత్సరాలకుగాను నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో గత కొంతకాలంగా నంది అవార్డులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనే సస్పెన్స్ కి తెర పడినట్లయ్యింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులకు బదులు కొత్త పేరుతో తాము అవార్డులను ఇస్తామని ప్రకటించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకుగాను నంది అవార్డులను ప్రకటించింది.

nandi_award2012 సంవత్సరానికిగాను ప్రకటించిన నందీ అవార్డులలో “ఈగ”, “ఎటోవెళ్లిపోయింది మనసు”, “మిథునం” సినిమాలు పోటీ పడ్డాయి. ఈ మూడు చిత్రాలలో “ఈగ” ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఈ సినిమాకు మొత్తం తొమ్మిది అవార్డులు లభించాయి.
“ఎటో వెళ్లిపోయింది మనసు” సినిమాకు నాలుగు అవార్డులు, “మిథునం” చిత్రానికి రెండు అవార్డులు, “మిణుగురు” చిత్రానికి అయిదు అవార్డులు దక్కాయి. ఎస్వీ రంగారావు పురస్కారానికి ఆశిష్ విద్యార్థిన ఎంపికయ్యారు. సీనియర్ నటి జయసుథ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎంట్రీలను పరిశీలించి విజేతలను నిర్ణయించింది. కమిటీ ఛైర్ పర్సన్ జయసుధ 2012 అవార్డుల జాబితాను ప్రకటించారు.
2013 అవార్డుల జాబితాను దర్శకుడు కోడి రామకృష్ణ ప్రకటించారు.
2012 సంవత్సరానికి గాను నందీ అవార్డుకు ఎంపికైన వివరాలు ఇలా ఉన్నాయి…
ఉత్తమచిత్రం-ఈగ,ఉత్తమరెండోచిత్రం-మిణుగురులు,ఉత్తమమూడోచిత్రం…మిధునం,ఉత్తమ దర్శకుడు….రాజమౌళి(ఈగ),ఉత్తమనటుడు-నాని(ఎటోవెళ్లిపోయిందిమనసు),ఉత్తమ పాపులర్ చిత్రం…జులాయి
ఉత్తమవిలన్-సుదీప్(ఈగ),ఉత్తమనటి-సమంత(ఎటోవెళ్లిపోయిందిమనసు), ఉత్తమ సహాయనటుడు-అజయ్(ఇష్క్),ఉత్తమసంగీతదర్శకుడు-కీరవాణి(ఈగ), ఇళయరాజా (ఎటో వెళ్లిపోయిందిమనసు)
ఉత్తమకొరియోగ్రాఫర్-జానీ(జులాయి),ఉత్తమ ఆడియోగ్రాఫర్- కడియాల దేవి కృష్ణ (ఈగ)
ఉత్తమస్పెషల్ఎఫెక్ట్-మకుట(ఈగ),ఉత్తమమాటల రచయిత-తనికెళ్భరణి(మిథునం)
ఉత్తమకాస్ట్యూమ్డిజైనర్-తిరుమల(కృష్ణంవందేజగద్గురం),ఉత్తమఫైట్మాస్టర్ -గణేష్ (ఒక్కడినే)
ఉత్తమనటుడు(స్పెషల్ జ్యూరీ అవార్డ్)-బాలసుబ్రహ్మణ్యం
ఉత్తమనటి(స్పెషల్ జ్యూరీఅవార్డ్)-లక్ష్మీ
ఉత్తమనేపథ్యగాయకుడు-శంకర్మహదేవన్(షిర్డీసాయి),ఉత్తమ నేపథ్య గాయని -గీతా మాధురి.

2013 సంవత్సరానికి గాను నందీ అవార్డుకు ఎంపికైన వివరాలు ఇలా ఉన్నాయి…
ఉత్తమ చిత్రం- మిర్చి
రెండో ఉత్తమ చిత్రం-నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం- ఉయ్యాల జంపాల
కుటుంబకథాచిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ నటుడు- ప్రభాస్‌ (మిర్చి)
బెస్ట్ పాపులర్ చిత్రం: అత్తారింటికి దారేది
ఉత్తమ నటి: అంజలి పాటిల్ (నా బంగారు తల్లి)
సహాయనటుడు- ప్రకాశ్ రాజ్(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
సహాయనటి- నదియా (అత్తారింటికి దారేది)
ఎస్వీ రంగారావు అవార్డు- నరేశ్
అల్లు రామలింగయ్య అవార్డు- తాగుబోతు రమేశ్
ఉత్తమ విలన్- సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ దర్శకుడు- కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ రచయిత- మేర్లపాక గాంధీ
ఉత్తమ కథా రచయిత- ఇంద్రగంటి మోహనకృష్ణ
ఉత్తమ మాటల రచయిత- త్రివిక్రమ్ శ్రీనివాస్
ఉత్తమ గేయ రచయిత- సిరివెన్నెల
ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీశ్రీప్రసాద్
ఉత్తమ తొలి దర్శకుడు- కొరటాల శివ
జాతీయ సమగ్రత చిత్రం డాక్యుమెంటరీ ఫిలిం- భారత కీర్తి మూర్తులు

Send a Comment

Your email address will not be published.