ఎట్టకేలకు రాజధాని రెడీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త రాజధానిని ఎట్టకేలకు ఖరారు చేశారు. ఇన్నాళ్ళూ విజయవాడగా భావిస్తూ వచ్చిన రాజధాని ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమయింది. రాజధానికి ప్రకాశం బ్యారేజీ, అనంతవరం, బోరుపాలెం, ఆటో నగర్లు సరిహద్దుల్ని ఆయన ప్రకటించారు. రాజధాని పరిధిలోకి ఇంతకుముందున్న 15 గ్రామాలు కాక, మరో పది గ్రామాలు చేరాయని ఆయన తెలిపారు. ఈ గ్రామాల మధ్య దూరం 53 కిలోమీటర్లని కూడా ఆయన చెప్పారు. కాగా రాజధాని చుట్టూ మూడు విశాలమయిన రింగ్ రోడ్లు నిర్మించడం జరుగుతుంది. మరో వైపు అపోహలు తొలగి, రైతులు తమ భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే హామీ పత్రాలు రాసి ఇస్తున్నాయి. ఇది ఇలా వుండగా, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం స్థల సేకరణను ప్రారంభించింది.

Send a Comment

Your email address will not be published.