ఎన్నికలలోకి పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగే ఆలోచనలో ఉన్నారు. ఆయన స్థాపించిన ‘జన సేన’ పార్టీ ఎన్నికల బరిలో దిగబోతోంది.

రెండు రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతం తుళ్ళూరులో భూమి సేకరణ విషయంలో ప్రభుత్వం తరఫున రైతులతో మాట్లాడుతున్న పవన్ తాను ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశంలో ఉన్నట్టు సంకేతాలు వదిలారు. మొదటగా తెలంగాణా రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలతో బరిలోకి దిగుతామని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. తెలంగాణాలో పలువురు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు ఇటీవలి కాలంలో పాలక తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో చేరడంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలకు అవకాశం ఏర్పడింది. ఇంతవరకూ పాలక తెలుగు దేశం పార్టీ, కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ తామే స్వయంగా ఎన్నికల్లో పాల్గోనాలన్న నిర్ణయం తీసుకోవడం అభిమానుల్ని సంభ్రమ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది.

Send a Comment

Your email address will not be published.