ఎన్నికల తరువాత విలీనం


వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణా రాష్ట్ర సమితి తమ పార్టీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణా బిల్లుపై రాష్ట్ర శాసనసభలో చర్చ ప్రారంభం అయింది. జనవరి 23 నాటికి బిల్లును రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, ఇతర సీమాంధ్ర నాయకులు ఈ తేదీని పొడిగించాలని, తమకు మరికొంత వ్యవధి కావాలని కోరుతున్నారు. దీనిపై రాష్ట్రపతి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అయిన దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో చెప్పారు. అవసరమయితే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశపరచి అయినా తెలంగాణా బిల్లుకు ఆమోదం పొందాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత విలీనంపై తెలంగాణా రాష్ట్ర సమితితో చర్చించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇది ఇలా వుండగా తెలంగాణా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా చర్చించడానికి ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది.

Send a Comment

Your email address will not be published.