ఎల్లలు లేని సంగీతం

ఎల్లలు లేని సంగీతం

DSC_0465DSC_0411 (1)
DSC_0409సంగీతానికి భాషతో సంబంధం లేదనేది నిర్వివాదాంశం. ప్రపంచంలోని నాగరికతల్లో అతి పురాతనమైనది అత్యంత ఉత్కృష్టమైనది భారతీయ నాగరికత. నాగరికత అంటే తన మనుగడను నిలుపుకుంటూ ప్రజల జీవన విధానం, ఆలోచనా సరళి, ఒక నిర్దిష్టమైన ప్రమాణాలను భావి తరాలకు అందివ్వడమే. ఈ ప్రక్రియలో సంగీతం అనేది లయకారుని భావాలను వ్యక్తపరిచే ఒక ఆలాపన. మన నాగరికతలో విలీనమైయున్న అవిభాజ్యమైన ఒక శక్తి. హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి ఒక నదీ ప్రవాహంలా అవసరమైనపుడు గర్జన చేస్తూ ప్రకృతి సౌందర్యాలతో పరవశించినపుడు శ్రావ్యమైన, వీనులవిందైన ధ్వని తరంగాలు అందిస్తూ ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది సంగీతం.

షుమారు 8 వేల కిలోమీటర్లు దూరంలో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న తన సంగీత సంపదను సాధనతో పరభాషా సంప్రదాయంలో రెండు విభిన్న సంస్కృతుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారులకు అందివ్వాలన్న తపనతో మూడు సంవత్సరాల వయసున్న పిల్లల దగ్గరనుండి యుక్త వయస్సులోనున్న పిల్లల వరకు స్వరాలను శాస్త్ర పరంగా పొరబాట్లు లేకుండా నేర్పించి వారి ప్రతిభను వెలికి తీస్తున్నారు రాగామృత సంచాలకులు శ్రీమతి మాధురి వాస గారు.
DSC_0067DSC_0186
రాగామృత సంగీత కళాశాల ఆరవ వార్షికోత్సవం ఈ నెల 5వ తేదీన లేవర్టన్ కమ్యూనిటీ హబ్ లో 250 మందికి పైగా వచ్చిన అతిధుల సమక్షంలో పిల్లలు ఎంతో శ్రద్ధాసక్తులతో నేర్చుకున్న బాణీలను, స్వరాలను హంసధ్వని, బీగడ, అభోగి
DSC-0094

DSC_0269రాగాలలో పాడి అతిధులను మంత్రముగ్దులను చేసారు. తమ రాగాలాపనలతో సంగీత సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఎందరో మహానుభావులను గుర్తుకు తెచ్చారు. మనది అన్న ఒక సంగీత స్వరాల పూదోటలో ప్రేక్షకులను ఓలలాడించి పరవశింపజేసారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్టోరియా మల్టీ కల్చరల్ కమీషనర్ శ్రీ చిదంబరం శ్రీనివాసన్ గారు విచ్చేసి ఇందులో పాల్గొన్న పిల్లలకు అతిధులకు అభినందనలు తెలిపి బహుమతులనందించారు. శ్రీమతి మాధురి వాస గారి నిబద్ధత, భావితరాలకు తన సంగీత కళా నైపుణ్యాన్ని అందివ్వాలన్న తపనను కొనియాడారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మరియు ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పిల్లలందరినీ ఆశీర్వదించారు.

Send a Comment

Your email address will not be published.