ఏపీలో 60 మినీ జిల్లాలు!

తెలంగాణ ప్రభుత్వం జిల్లాలను భారీ సంఖ్యలో పెంచగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ పని చేయకుండానే పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుడుతోంది.

అరవై మినీ జిల్లాలుగా పరిపాలనను వికేంద్రీకరించడానికి ముఖ్యమంత్రి కార్యాచరణ రూపొందిస్తున్నారు. రెవిన్యూ డివిజన్ ను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రభుత్వ పథకాల అమలు, మంజూరు, పర్యవేక్షణ అంతా అక్కడి నుంచే జరిగేలా చూడాలని ఆయన భావిస్తున్నారు. కొత్తగా చేపడుతున్న ఈ పాలనా సంస్కరణలతో ఇప్పటి వరకూ కేవలం రెవిన్యూ వ్యవహారాలకు పరిమితమయిన ఆర్దీవోల పాత్ర మరింత విస్తరించనుంది. జిల్లాల్లో కలెక్టర్లు అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యకలాపాలను ఎలా పర్యవేక్షిస్తున్నారో, రెవిన్యూ డివిజన్ స్థాయిలో ఆర్దీవోలు అలా పర్యవేక్షించవలసి ఉంటుంది. ఈ వికేంద్రీకరణ దీపావళి తరువాత అమలులోకి రాబోతోంది.

Send a Comment

Your email address will not be published.