ఏపీ ప్యాకేజీకి కేంద్రం ఆమోదం

ప్రత్యేక హోదాకు బదులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలన్న ఆర్ధిక శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. దీనితో, అయిదు కోట్ల ఆంధ్రులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ప్యాకేజీకి అన్ని అడ్డంకులూ తొలగినట్టయింది.

స్వరాష్ట్రంలో నూతన రాజధానిలో, కొత్త శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రోజునే కేంద్రం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేయడం విశేషం. ఈ ప్యాకేజీ ప్రకారం, పోలవరం ప్రాజెక్ట్ కు అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. గ్రాంట్స్ రూపేణా రాష్ట్రానికి సుమారు లక్ష కోట్ల రూపాయలు తక్షణమే లభిస్తాయి. అనేక పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రమే తొంభై శాతానికి పైగా కేటాయింపులు జరుపుతుంది. కేంద్ర మంత్రివర్గం దీనికి ఆమోద ముద్ర వేయడంతో ప్యాకేజీకి చట్టబద్ధత వచ్చ్చినట్టయింది.

Send a Comment

Your email address will not be published.