ఐటీ కేంద్రంగా వైజాగ్

విశాఖపట్నం నగరాన్ని ఐటీ కేంద్రంగా, సిలికాన్ కారిడార్ గా అభివృద్ధి చెందించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై, 2014-2020 సంవత్సరాలకు ఐ టీ విధానాన్ని ఖరారు చేసింది.
ఇందుకోసం ఎన్ని నిధులయినా ఖర్చు చేయడానికి సిద్ధమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశం తరువాత ప్రకటించారు. ప్రపంచం లోని ఐ టీ దిగ్గజాలని ఆహ్వానించి, వారితో ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేయించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, తిరుపతి నగరాలలో కూడా ఐ టీ కేంద్రాలను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైజాగ్ నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టును ఆరంభిస్తామని, రాష్ట్రంలో 14 పోర్టులు, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఆయన ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.