ఐదు పదుల సినీ ప్రస్థానం

Sri-Sri-Movie

కౌబాయ్ పిక్చర్ లు అనగానే ఏమాత్రం తడవుకోకుండా చెప్పుకునే పేరు కృష్ణ. సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి . ఆయన సినీ ప్రస్థానం సామాన్యమైనది కాదు.

గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31 వ తేదీన పుట్టిన కృష్ణలో బహుముఖ ప్రజ్ఞలు ఉన్నాయి. నటుడే కాకుండా నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న కృష్ణ రాజకీయ జీవితంలోను ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగాను ప్రజలకు కృష్ణ సేవలు అందించారు.

వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పుట్టి పెరిగిన కృష్ణ బీఎస్సీ డిగ్రీ పొందారు.
టాలీవుడ్ లో అయిదు దశాబ్దాలు కొనసాగిన కృష్ణ మూడు వందల యాభై చిత్రాలకు పైగా నటించారు. 350 చిత్రాలలో నటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించడం విశేషం.

కృష్ణ 1965 లో ఇందిరను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు (రమేష్ బాబు- నిర్మాత, మహేష్ బాబు – హీరో), ముగ్గురు కుమార్తెలు పుట్టారు. కూతుళ్ళ పేర్లు – పద్మావతి , ప్రియదర్శని , మంజుల. అనంతరం విజయనిర్మలను పెళ్లి చేసుకున్న కృష్ణకు రమేష్ బాబు, మహేష్ బాబు కలిగారు.

చదువుకుంటున్న రోజులలోనే నాటకాల్లో నటించిన కృష్ణ శోభన్‌బాబుతోనూ కలిసి ఓ నాటకం వేశారు.

మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన కృష్ణ హీరోగా స్థిరపడి పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న మొదటి చిత్రం “తేనెమనసులు”. Gudachari116ఈ చిత్రంలో కృష్ణ జోడీగా సుకన్య నటించారు. ఈ చిత్రం 1965 మార్చి 31వ తేదీన విడుదల అయి వంద రోజులు ఆడింది. “తేనెమనసులు” చిత్రానికి కృష్ణకు రెండు వేల రూపాయలు పారితోషికంగా ఇచ్చారు.

ఆ తర్వాత “కన్నెమనసులు” చిత్రంలో నటించగా అది 1966 జులై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక కౌబాయి పిక్చర్స్ లో వరుసపెట్టున నటించిన కృష్ణ మొదటి డిటెక్టివ్ చిత్రం పేరు “గూఢచారి 116”. ఈ చిత్రం 1966 ఆగస్టు 11న విడుదల అయ్యింది. ఈ చిత్రంతో కృష్ణ ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఈ

చిత్రంతోనే కృష్ణకు ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్’ అనే పేరు కూడా వచ్చింది.

కృష్ణ జానపద సినిమాల్లోనూ నటించకపోలేదు. “‘ఇద్దరు మొనగాళ్ళు” అనే జానపద చిత్రంలో నటించిన కృష్ణ ఒక్క 1967లోనే ఈ సినిమాతోపాటు మొత్తం అర డజన్ చిత్రాల్లో నటించారు.

కృష్ణ నటించిన కౌ బాయి చిత్రాలలో మొదటిది “మోసగాళ్ళకు మోసగాడు” చిత్రం.

కృష్ణ ఎన్ని చిత్రాల్లో నటించినా ఆయన కెరీర్ లో ఎప్పటికీ గొప్ప సినిమాగా చెప్పుకునేది “అల్లూరి సీతారామరాజు” చిత్రం. ఎన్నో కష్టనష్టాలు భరించి కృష్ణ సమర్పించిన చిత్రమే “అల్లూరి సీతారామ రాజు”.
ఇది సూపర్ డూపర్ హిట్టైన చిత్రం. ఈ చిత్రమే టాలీవుడ్ లో మొదటి స్కోప్ చిత్రం.

కృష్ణ నటించిన సింహాసనం చిత్రం మొదటి 70 ఎమ్ఎమ్ చిత్రంగా రికార్డు అయ్యింది.

అంతేకాదు మొదటి డి.టి.ఎస్. చిత్రంగా టాలీవుడ్ లో “తెలుగు వీర లేవరా” (1988) తో Krishnaటెక్నాలజీలను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణకే దక్కింది.

పద్మాలయా సినిమా స్టూడియోను స్థాపించి అనేక చిత్రాలను నిర్మించిన కృష్ణ 17 చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.

ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూధనరావు, కె. విశ్వనాధ్, బాపు, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పని చేసిన కృష్ణ తన సినీ జీవితంలో 80 మంది హీరోయిన్లతో నటించారు. విజయనిర్మలతో 50కి పైగా సినిమాలలో కృష్ణ నటించడం ఒక రికార్డు.
ఆ తర్వాత జయప్రద తో కలిసి 47 చిత్రాలలోను, శ్రీదేవి 31 చిత్రాల్లోను నటించారు.

కృష్ణ సమర్పించిన “అల్లూరి సీతారామరాజు” చిత్రంలోని “తెలుగు వీర లేవరా…” అనే పాటకు జాతీయస్థాయిల్లో ఉత్తమ గేయరచయితగా శ్రీశ్రీకి అవార్డు లభించింది. ఈ క్రమంలో ఒక తెలుగు చిత్రానికి జాతీయస్థాయి బహుమతి రావడం ఇదేమొదటిసారి.

కృష్ణ 1980లో హిందీ చిత్రరంగంలో ప్రవేశం చేసి జితేంద్రను హీరోగా ఎంపిక చేసి ‘సింఘాసన్’ సినిమా నిర్మించారు.

2012 లో రాజకీయాల నుంచి తప్పుకున్న కృష్ణను మానవత్వమున్న వ్యక్తిగా చెప్పుకుంటారు. అలాగే నిజాయితీకి, నిబద్దతకు ఆయన పెట్టింది పేరు.

ఆయన పేరిట ఇప్పుడు మరో అరుదైన రికార్డు కూడా నమోదు కాబోతోంది. ఆయన నటించిన “శ్రీశ్రీ” చిత్రం థియేటర్ లలో ను, ఆన్ లైన్ లోను ఏకకాలంలో విడుదల కాబోవడం విశేషం. ఈ చిత్రానికి దర్శకులు ముప్పలనేని శివ. ఇది జూన్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ ఏడాది తోనే కృష్ణ టాలీవుడ్ లో రంగప్రవేశం చేసి యాభై ఏళ్ళు పూర్తి అవుతుంది.
—————————-
జగదీష్ యామిజాల

Send a Comment

Your email address will not be published.