ఐ టి పోలీసులు

Forensic techపోలీసులకు ఆధునిక పరిజ్ఞానం

తెలుగు రాష్ట్రాల్లో పోలీసులను స్కాట్లాండ్ పోలీసులతో సమానంగా ఆధునికంగా తీర్చిదిద్దడానికి ఆయా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి.

వారికి ఇతర ఆధునిక పరికరాలతో పాటు, లాప్టాప్ లు కూడా ఇవ్వడానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. తెలంగాణాలో పది వేల మందిని, ఆంధ్ర ప్రదేశ్ లో 12 వేల మందిని ఇందుకు ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారికి ఆధునిక దర్యాప్తు పద్ధతులు, సాంకేతిక పరికరాల వినియోగం, ఆధునిక ఆయుధాల వాడకం, ఫోరెన్సిక్ పరీక్షల్లో అత్యున్నత స్థాయి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. వీరిని టెకీ పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సుమారు తొమ్మిది వేల మందికి చాలా వరకు శిక్షణ పూర్తయిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సాంకేతిక శిక్షణకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా నిధులు, మందీ మార్బలాన్ని సమకూరుస్తుంది. నిజానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ పోలీసులు ఇప్పటికే పూర్తి చేసుకుని రంగంలోకి కూడా దిగిపోయారు. నేరస్థుల డేటా కలెక్షన్, డేటా నిర్వహణ, ఐరిస్, ప్రోగ్రామింగ్, ఫింగర్ ప్రింట్ డేటా వంటి విషయాల్లో వీరికి ప్రధానంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కోసం అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థల నుంచి కూడా సుమారు నలభై అయిదు మంది నిపుణులను రప్పించారు. ఉభయ రాష్ట్రాల్లోనూ కలిపి ఈ శిక్షణ, సాధన సంపత్తి కోసం ఏడాది కాలం పాటు వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.