“ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్ (OFTRS)” ఆద్వర్యంలో ప్రొ.జయశంకర్ సంస్మరణ సభ

OFTRS3

ముఖ్య అతిధిగా తెలంగాణా ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు నిరంజన్ రెడ్డి

టి. ఆర్. యస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ “ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్ (OFTRS)” ఆద్వర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా, “తెలంగాణా స్పూర్తి సభ” మెల్బోర్న్ లో ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిధిగా తెలంగాణా ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో భారీ సంఖ్యలో తెలంగాణ వాదులు, టి.ఆర్.యస్ కార్యకర్తలతో పాటు మెల్బోర్న్ లో నివసిస్తున్న  టి అర్ ఎస్ మద్దతుదారులు, సానుభూతిపరులు  పాల్గొన్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్ (OFTRS) అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన  ప్రారంబమైన ఈ కార్యక్రమం, ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూలతో నివాళులర్పించి, తెలంగాణ అమరవీరులను , జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, తెలంగాణ బావజాల వ్యాప్తిలో జయశంకర్ గారి పాత్ర గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేసారని, ప్రతి వ్యక్తి జీవితంలో శ్రీ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.  టి. ఆర్. యస్ పార్టీ జెండా మోసే అవకాశం కలిగించిన కే. సీ. ఆర్ గారికి, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి ప్రోత్సహించిన కవిత గారికి, అలాగే నేడు ముఖ్య అతిధి గా వచ్చి ప్రోత్సహిస్తున్న నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. అధికారిక శాఖ ఏర్పాటు జరిగిన తరువాత జరుగుతున్న మొదటి కార్యక్రమమైనపట్టికి, భారీ సంఖ్య లో తెలంగాణా బిడ్డలు, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడం పట్ల ప్రజల్లో ముఖ్యంగా ప్రవాస బిడ్డల మనసుల్లో కే. సీ. ఆర్ గారి నాయకత్వం పట్ల ఉన్న అభిమానానికి నిదర్శం అని తెలిపారు.

OFTRS2

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్ ఆస్ట్రేలియా శాఖ భవిష్యత్తు కార్యక్రమాలు, విధి – విధానాల గురించి సభకు వివరించారు. గతం లో తెలిపినట్టు మరొక్కసారి ఆసక్తి గల టి. ఆర్. యస్ పార్టీ అభిమానులకు, మద్దతుదారులు ముందుకు వచ్చి అధికారిక శాఖ లో పాల్గొని మనమందరం కలిసి పార్టీకి మన వంతు బాద్యత నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణా ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ, టి. ఆర్. యస్ పార్టీకి -జయశంకర్ గారికి ఉన్న అనుబందం గురించి అలాగే వ్యక్తిగతంగా వారికి ఉన్న సాన్నిహిత్యం గురించి సభకు వివరించారు. తెలంగాణ సమాజానికి ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సాధనకు జయశంకర్ గారు చేసిన కృషి చాలా గొప్పదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి కే. సీ. ఆర్ గారు తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా వైపు తీసుకెళ్తున్న తీరుని, వివిద రంగాల్లో నేటి వరకు జరిగిన – భవిష్యత్తులో జరగబోయే అభివృద్ది గురించి సభకు వివరించారు. ఎన్నారైలుగా పార్టీకి చేస్తున్న సేవను అభినందించి, అన్ని సమయాల్లో అందుబాటులో ఉండి కావలసిన సహాయం అందిస్తానని తెలిపారు.

డాక్టర్ శ్రీ అనిల్ కుమార్ చీటీ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారి విధ్యాబ్యాసం గురించి ఆయన విద్యార్థి దశలోనే ఎదుర్కొన్న వివక్షను గురించి వివరించారు. ముల్కి, నాన్ ముల్కి ఉద్యమంలో, ఫజల్ అలీ కమిషన్లో మరియు మొదటి హెచ్ అర్ సి నివేదికలో ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను జయశంకర్ గారు వివరించిన తీరు ఆనాటి జాతీయ కాంగ్రెస్ నాయకుల కళ్ళు తెరిపించిందిన్నారు. కాని తెలంగాణ లో నాయకత్వ లోపం వల్ల అది ముందుకు కదలలేకపోయిన విషయం విదితమే. విద్యార్థిగా,ఉపాధ్యాయుడిగా మరియు కాకతీయ విశ్వ విద్యాలయ ఉపకులపతిగా ఆయన అందించిన సేవలు మరువలేనివనీ ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ కూడా చిరంజీవిగా నిలిచిపోతారన్నారు.  జయశంకర్ సార్ పేరు మీద మన నూతన తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లా నామకరణ ప్రతిపాదన హర్షణీయమన్నారు అందుకు ముఖ్యమంత్రి కె సి అర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తో పాటు సంస్థ ముఖ్య నాయకులు డా. అనిల్ రావు చీటీ,అనిల్ బైరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించి, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అద్యక్షుడు నాగేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు నాగేందర్ కాసర్ల తో పాటు ముఖ్య నాయకులు అనిల్ బైరెడ్డి, అనిల్ రావు చీటీ, అర్జున్ చల్ల గుల్ల, అమర్ రావు చీటీ, సత్యం రావు, ప్రకాష్ సూరాపనేని, రోహిత్, సనిల్, ఉదయ్ కల్వకుంట్ల, సాయి ఉప్పు, శ్రీనివాస్ చింతల, అభినయ్ కనపర్తి, ప్రవీణ్ లేడల్ల, సుధాకర్ రెడ్డి, ఆదిరెడ్డి, మధుసూదన రెడ్డి తిమ్మాపురం, సురేందర్ రెడ్డి తిమ్మాపురం  సభ్యులు అవినాష్, రాఘవేందర్,వెంకట్, హేమంత్,కిరణ్, అటై (ATAI) ప్రథినిదులు ప్రవీణ్ దేశం, రాజ్ ఉల్పల,శ్రీనివాస్ కర్ర మరియు ఇతర తెలంగాణ వాదులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
OFTRS1

Send a Comment

Your email address will not be published.