ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ ఇఫ్తార్ విందు

ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ ఇఫ్తార్ విందు

IMG_2209

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరం లో ఎన్ ఆర్ ఐ, టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ – ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ ఆధ్వర్యం లో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. మాజీ ఎం ఎల్ ఏ, టి ఆర్ ఎస్ నాయకులు శ్రీ నోముల నర్సింహయ్య గారు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఇట్టి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముస్లింలతో పాటు ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు మరియు అధ్యక్షుడు శ్రీ నాగేందర్ రెడ్డి కాసర్ల గారు పాల్గొన్నారు.

ఇఫ్తార్ అనంతరం జరిగిన సమావేశంలో శ్రీ నర్సింహయ్య గారు మాట్లాడుతూ తెలంగాణ లో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె సి ఆర్ గారు మైనార్టీ సంక్షేమం కోసం చేస్తున్న కృషిని మరియు వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణం లో భాగంగా గత రెండేళ్ల పాలనలో ఎంతో వేగంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో ఆస్ట్రేలియా లోని తెలంగాణ బిడ్డలందరు కూడా తమవంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు నర్సింహయ్య గారి సమక్షంలో ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ లో చేరారు,ఆయన వారందరినీ పార్టీ కండువాలు కప్పి అభినందించారు.

ఎంపి శ్రీమతి కవిత గారి ఆదేశాల మేరకు శ్రీ నాగేందర్ రెడ్డి కాసర్ల గారి నాయకత్వం లో ఇటీవలే స్థాపించబడిన ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అనతికాలంలోనే పెద్ద మొత్త్తంలో సభ్యులను కూడగట్టుకొని, చురుకుగా ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహించడం హర్షణీయమనీ,క్రమశిక్షణతో పని చేస్తున్న సభ్యులందరినీ అభినందించారు. శ్రీ నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్బంగా ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా మెనార్టీ సెల్ స్థాపిస్తూ దానికి శ్రీ జమాల్ గారిని ఇంచార్జిగా నియమిస్తున్నట్టు తెలిపారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామనీ,మున్ముందు ఆస్ట్రేలియాలో ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఇండియాలో తాము చేయబోయే సేవలకు కూడా ప్రణాళిక రూపకల్పనలో ఉన్నామని తెలిపారు. ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ స్థాపించిన తరువాత వివిధ సంఘాల సభ్యులను ఒక్క తాటిపైకి తీసుకొని వచ్చి శ్రీ నర్సిహ్మయ్య గారు అందించిన సహకారం ఎంతో అమూల్యమైనదని అన్నారు

IMG_2198

ఈ కార్యక్రమానికి ఓ ఎఫ్ టి ఆర్ ఎస్ కోర్ సభ్యులు డాక్టర్ శ్రీ అనీల్ కుమార్ చీటి గారు, అనిల్ బైరెడ్డి గారు, అర్జున్ చల్లగుళ్ళ, ప్రకాష్ సూరపనేని, సాయిరాం ఉప్పు, అమర్ రావ్ చీటి,అభినయ్ కనపర్తి,అమర్ రావ్,రోహిత్ రెడ్డి రాంపూర్,సత్యం గుర్జపల్లి,సనిల్ బాసిరెడ్డి, ప్రవీణ్ దేశం, శ్రీనివాస్ కర్ర,కిరణ్ పాల్వాయి, మధు పర్స, ఉదయ్ కల్వకుంట్ల, సాయిరాజ్ ఉట్నూర్, ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ ట్రెజరర్ రాంపాల్ ముత్యాల తో పాటు మైనార్టీ సభ్యులు అబ్దుల్ హబీబ్, అబ్దుల్ ముజీబ్, ఆఫ్జల్ మహ్మద్, వాహజ్, అబ్దుల్ రజాక్, అక్రమ్ మొహమ్మద్,రిజ్వాన్,వకార్ యూనిస్,అబ్దుల్ మరియు ఇతర తెలుగు సంఘాల సభ్యులు రాజు ఉల్పాల,నవీన్ జూలూరి, మురళి ధర్మపురి తదితరులు పాల్గొన్నారు.

Send a Comment

Your email address will not be published.