కరెంటు కష్టాలు

సీమాంధ్ర ఉద్యమ తీవ్రతతో రాష్ట్ర ప్రజల తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు, పలు రైళ్లకు తీవ్రమైన కరెంటు కష్టాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోని యు. పి. ఎ. ప్రభుత్వం వెంటనే తెలంగాణ నోట్ ని వెనక్కు తీసు కొని రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జె.ఎ.సి. ఆదివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకి దిగడం తో రాష్ట్రములోని సీమాంధ్ర ప్రాంతాలతో పాటు పలు రైళ్ళు, మరో నాలుగు రాష్ట్రాలకు కరెంటు కష్టాలు ప్రారంభమయ్యాయి.

విజయవాడ లోని విటిపిఎస్ లో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఉద్యోగులు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేశారు. ఇంకా శ్రీశైలం, విశాఖ పట్టణం లోని పవర్ ప్లాంట్స్ లో కూడా విద్యుత్ కార్మికులు ఉత్పత్తిని నిలిపి వేయడంతో రాష్ట్రములో విద్యుత్ పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా చీకటి రాజ్యం ఏలింది. ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. ఇంకా రాజధాని నగరం హైదరాబాద్ లోనూ, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలిగింది. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా పరిస్థితిని ఇలాగే కొన సాగిస్తే అక్కడ కూడా చీకట్లు తప్పవని ఉద్యోగులు హెచ్చరిస్త్తున్నారు.

రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం

విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో పలు రైళ్ళ రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విజయవాడ మీదుగా వెళ్ళే పలు రైళ్ళు గమ్యం చేరకుండా ఎక్కడివి అక్కడ ఆగి పోయాయి. నారాయనాద్రి పద్మావతి, వంటి పలు రైళ్ళు నెల్లూరు , వేంకటగిరి స్టేషన్ లలో ఆగిపోయాయి. ఇంకా విజయవాడ నుంచి రేణిగుంట వెళ్ళే అన్ని పాసేంజేర్ రైళ్ళు , కాఛిగూడ పాసేంజేర్లు రద్దు అయ్యాయి. డీజిల్ ద్వారా కొన్ని ఎక్స్ ప్రెస్లు నడుస్తున్నాయి. సోమవారం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ళను కూడా రద్దు చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రద్దు చేసిన రైళ్ళ వివరాలతో పాటు ప్రతి స్టేషన్ లోను హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసారు. ప్రయాణికులు హెల్ప్ లైన్ ద్వారా తాము ప్రయాణించాల్సిన మార్గం లో రైళ్ళ పరిస్థితి తెలుసుకొని బయలు దేరాలని సూచిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాలకూ తప్పని ఇక్కట్లు

రాష్ట్రములో ఏర్పడ్డ సంక్షోభం వల్ల పొరుగు రాష్ట్రాలకూ విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. విద్యుత్ కార్మికులు ఉత్పత్తిని నిలిపి వేయడంతో తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా విద్యుత్ రంగం సంక్షోభం లోకి వెళ్లనుంది.

Send a Comment

Your email address will not be published.