కాంగ్రెస్ పార్టీకి షాక్!

రాయలసీమకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జె.సి. దివాకర్ రెడ్డి తాను కూడా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాను సమైక్య ఆంద్ర అజెండా మీద రాజ్యసభకు పోటీ చెయదలచుకున్నట్టు  ఆయన శుక్రవారం తెలిపారు. ఆయన ప్రకటన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆశ్చర్యపరచింది. పైగా ఆయన తనకు ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాస రావు, మరికొందరు సీమాంధ్ర శాసనసభ్యులు మద్దతు ప్రకటించినట్టు కూడా చెప్పారు. సీమాంధ్ర అజెండా మీద ఒక్కరు మాత్రమే రాజ్యసభకు పోటీచేస్తారని గంటా తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఒక అభ్యర్థిని సమైక్యాంధ్ర అజెండా మీద నిలబెడుతున్నట్టు ఆయన చెప్పారు.  ఈ ఎన్నికలతో సీమాంధ్ర అజెండాకు ఎంతమంది మద్దతు ఇస్తున్నదీ తేలిపోతుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో రాజ్యసభకు ఆంద్ర ప్రదేశ్ నుంచి ఎన్నికలు జరగాల్సి ఉంది.

Send a Comment

Your email address will not be published.