కాకినాడకు పెట్టుబడుల వరద

జీ ఎం ఆర్ గ్రూప్ సారథ్యంలోని కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (సెజ్)లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అనేక హేమా హేమీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, గ్యాస్ అథారిటీ అఫ్ ఇండియా సంయుక్తంగా ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఈ భారీ రిఫైనరీ కోసం సెజ్ లో రెండు వేల ఎకరాల్ని కేటాయించారు. ఈ సంస్థలు సంయుక్త భాగస్వామ్యంలో నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది కాకుండా ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్ 250 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో వైపు చైనా దేశానికి చెందిన యంగ్ రాంగ్ ఎలెక్ట్రికల్స్ ౩౦౦ ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పరిశ్రమను ప్రారంభించబోతోంది. మరో పదిహేను కంపెనీస్ కూడా ఈ మధ్యకాలంలో సెజ్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీనివల్ల తూర్పు గోదావరి జిల్లాలో సుమారు ఇరవై వేల మందికి ఉదోగాలు లభించే అవకాశం ఉంది.

Send a Comment

Your email address will not be published.