కానుకల తాతయ్య శాంటా క్లాజ్

బుజ్జీ.. చిన్నీ… పండూ… ఇదిగో నీ బహుమతి అంటూ ప్రతి సంవత్సరం క్రిస్టమస్ ముందు రోజు రాత్రి ఓ తెల్లని గెడ్డం ఆయన మన దగ్గరకి వస్తాడు. బోలెడన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్ లతో పాటు మనం అడగకుండానే మనల్ని గిఫ్టు లతో ముంచెత్తుతాడు. అతనే క్రిస్మస్ తాత శాంటా క్లాజ్.

తెల్లని కాలర్ ఉన్న రెడ్ కోట్ తొడుక్కుని , తెల్లని గడ్డంతో భుజానికి బహుమతుల సంచి, బ్లాక్ బెల్ట్ తో ఎప్పుడూ చిన్నారుల మధ్య ఉషారుగా కబుర్లు చెప్పే తాతయ్యే శాంటా క్లాజ్. ఆయన్ని చూస్తే చిన్నారుల్లో ఆనందం కట్టలు తెంచు కొంటుంది. క్రిస్మస్ కి ముందు రోజు వచ్చే ఆయన్ని చూడటం కోసం అందరూ నెల రోజులు ముందు నుంచే ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే క్రిస్మస్ తాత ఈసారి మాకు ఏమి గిఫ్ట్ లు తెస్తాడు ? మా ఫ్రెండ్స్ కి ఏమి తెస్తాడు ? ఎవరిదీ బావుంటుంది ? అనే ఆలోచనల తోనే వారి మనసంతా నిండి పోతుంది. క్రిస్మస్ తాతయ్య అన్ని వయసుల వారికీ బహుమతులు ఇస్తాడు, ఇంటిల్లి పాదినీ పండగ చేసుకోమంటాడు. ప్రపంచమంతా కానుకలు పంచే క్రిస్మస్ తాత విశేషాలు.

ఆయన పేరు శాంటా క్లాజ్. ఇంకా సెయింట్ నికోలస్, ఫాదర్ క్రిస్మస్, క్రిస్ క్రింగ్లీ అంటారు. సింపుల్ గా అయితే శాంటా అంటారు. ఎవరి ఇంట్లో పిల్లలు మంచిగా, బుద్ధిగా ఉండి బాగా చదువు కుంటారో వారి ఇంటికి క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంటా క్లాజ్ వస్తాడు.ఆ పిల్లల కోసం మంచి మంచి బహుమతులు తెస్తాడని ప్రజల నమ్మకం. ప్రపంచమంతా ఇదే భావనలో ఉన్నప్పటికీ, కొన్ని దేశాల్లో మాత్రం డిసెంబర్ 6వ తేదీన చిన్నారుల కోసం శాంతా వచ్చేస్తాడు.

ఆ రోజును సెయింట్ నికొలెస్ డే గా జరుపు కుంటారు.

ఇప్పుడు మనం చూసే శాంటా క్లాజ్ రూపం 19 వ శతాబ్దం నుంచే ప్రపంచానికి పరిచయమయ్యాడు. 1823 లో విడుదల అయిన ఒక గీతం ‘ ఎ విజిట్ ఫ్రం సెయింట్ నికోలస్ ‘ నుంచి తీసుకున్న ఛాయా చిత్రం. దీనిని ధామస్ నాస్ట్ అనే పొలిటికల్ కార్టూనిస్ట్ వేశారు.

ఇరవయ్యో దశాబ్దం నుంచి ‘ శాంటా క్లాజ్ ఈజ్ కమింగ్ టు టౌన్ ‘ పాటతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్నారులు అందరికీ పరిచయం అయ్యాడు. ఇంకా చిన్నారులకు చాక్లెట్స్, కాండీలు పంచడంతో పాటు అల్లరి పిడుగులకి బొగ్గు ముక్కలు కూడా ఒక్క రాత్రి లోనే ప్రపంచమంతా పంచే వాడు.

క్రిస్మస్ కి చర్చిలో బహుమతులు పంచడం అనేది ముందుగా నాలుగో శతాబ్దానికి చెందిన నికోలస్ మైరాతో ప్రారంభ మైంది. ఇతను లైసియాలోని గ్రీక్ క్రిస్టియన్ బిషప్. పేదవారికి ఆర్ధికంగా సహాయం చేయడం, వారి పిల్లల పెళ్లిళ్లకు బహుమతులు, డబ్బులు ఇవ్వటంతో అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పుకునే వారు. మరో వ్యక్తీ సెయింట్ నికోలస్. ఈయన పదమూడో శతాబ్దానికి చెందిన ఇటలీ దేశస్తుడు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ ముందు రోజు చుట్టు పక్కల గ్రామాలకి బండ్ల మీద వెళ్లి అందరికీ బహుమతులు పంచేవాడు. అందుకని ప్రతి ఊరి ప్రజలూ ఆయన రాక కోసం నిరీక్షించే వారు. బండి కనపడగానే ” శాంటా క్లాజ్ వస్తున్నాడు, బహుమతులు తెస్తున్నా” డని అరిచి పరిగెత్తే వారు. అప్పటి నుంచి ప్రతి దేశంలోనూ క్రిస్మస్ కు ముందు రోజు రాత్రి శాంతా క్లాజ్ రావటం, బహుమతులు పంచడం ఆనవాయితీగా మారింది.

Send a Comment

Your email address will not be published.