కాన్బెర్రాలో రిపబ్లిక్ మరియు ఆస్ట్రేలియా డే

ఆస్ట్రేలియా భారత దేశాలు గొప్ప ప్రజాస్వామ్య వ్యస్థలు.  ఒకరికొకరు అండగా నిల్చొని అవినాభావ సంబంధాలు కలిగి ఉండడమే కాకుండా రెండు దేశాలు ఒకేరోజు చారిత్రాత్మక దినాలను వేడుకలతో జరుపుకోవడం చాలా గొప్ప విషయం.  ఈ రెండు రోజుల మేలు కలయికను (భారత గణతంత్ర మరియు ఆస్త్రేలియా డే ) పురస్కరించుకొని కాన్బెర్ర తెలుగు సంఘం వారు ఆస్ట్రేలియా ముఖ్యపట్టణమైన కాన్బెర్ర లో నిర్వహించిన తేట తెలుగు రస ఝురి, సంగీత విభావరి ” సరిగమలు గలగలలు”

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి  మాతృదేశం నుండి ప్రముఖ సంగీత గాయకులు రేవంత్, అంజనా సౌమ్య, చిరంజీవి ప్రవస్తి, గాయకుడూ మరియు సంగీత దర్శకులు “నంది” అవార్డ్ గ్రహీత శ్రీ వినోద్ బాబుగారు  మరియు పేరడీ మాంత్రికులు రివర్స్ గేర్ గురుస్వామి గారు  విచ్చేసి కాన్బెర్ర తెలుగువారికి తెలుగు పాటను, మాటలను మరియు హాస్యాన్ని రుచి చూపి ఒక సాయంకాలాన్ని ఉల్లాసంగా ఉత్సాహమైన వాతావరణంలో ఆనందడోలికల్లో ముంచెత్తి కాన్బెర్రా తెలుగువారి చరిత్రలో మరువరాని రోజుగా చెరగని ముద్ర వేసారు.

గాయకులు, గాయనీ మణులు వయసులో చిన్న వారైనా వారి గళంతో తెలుగు సినీ వినీలాకాశంలోని గాయకులన్దరినీ తలపింప జేసి తెలుగు పాటల స్వర్ణ యుగానికి తీసుకెళ్ళారు.  సంగీత సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు అయిన ఘంటసాల గారి మధుర స్మృతుల్ని, శ్ర్రీ ఎస్పీ బాలు గారి రసగంగ రాగాల్నీ అలఓకగా పాడి ఎంతో ఉల్లాసభరితమైన సాయం సంధ్యా సమయాన్ని కాన్బెర్రా తెలుగు వారికందిచ్చిన ఘనత ఈ చిన్నారులదే

ఈ బృహుత్ కార్యక్రమం కాన్బెర్రాలో జరుగడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకొడ్డి ఈ కార్యక్రమం రూపుదిద్దిన  కాన్బెర్ర తెలుగు సంఘంలో ప్రముఖులు,   అధ్యక్షులు శ్రీ కృష్ణ గారు, కార్యదర్శి శ్రీ చిట్టిబాబు గారు, ఉపాధ్యక్షులు శ్రీమతి సాహితీ పాతూరి గారు, కోశాధికారి శ్రీ నరేంద్ర వేముల గారు కార్యవర్గ సభ్యులైన శ్రీమతి రాధిక, శ్రీమతి వీణ మరియు రుద్ర గార్లు అభినందనీయులు …

కార్యక్రమం మొదటగా విఘ్నేశ్వర గీతాలాపనతో ప్రారంభమై,  అంజనా సౌమ్య తన గాత్ర మాధుర్యంతో, రేవంత్ యువతను రెచ్చగొట్టే పాటలతో  ప్రేక్షకులను రంజింప చేయగా, వినోద్ బాబు గారు పాత పాటలను ఎంతో మధురంగా పాడి ప్రేక్షకుల మన్ననలు పొందారు,  చిన్నతల్లి చిరంజీవి ప్రవస్తి తన పాటలతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది, తన రివర్స్ పాటల గారడితో .. చలోక్తులతో గురుస్వామిగారు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కృష్ణగారు తమ సందేశంలో కాన్బెర్ర తెలుగు సంఘం చేస్తున్న కార్యక్రమాలను, తెలుగు భాష పై ప్రవాసాన తెలుగు వారికున్న బాధ్యతలను మరియు తెలుగు బాషాభివ్రుద్ధికై నడుపుతున్న తెలుగు బడి విశేషాలను తెలియపరిచారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోడూరు రామమూర్తి గారు విచ్చేసినారు. కుమారి శసి మరియు శ్రీమతి సుష్మ  యాంకర్లుగా వ్యవహరించగా, పట్టణంలో ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్ “ఢిల్లీ -6 ” ఈ కార్యక్రమానికి  ఆర్దిక సహాయం  చేసి  జయప్రదం కావడానికి ఎంతగానో సహకరించారు,  చివరిగా చిట్టిబాబుగారి అభినందనలు, మన జాతీయ గీతాలాపన “జన గణ మన” తో కార్యక్రమం ముగిసింది.

Send a Comment

Your email address will not be published.