కాన్బెర్రా తెలుగు బడికి ముచ్చటగా మూడేళ్ళు

TAC-Telugubadi

పక్షపాతం లేని తెలుగు అక్షరానికి తెలుగు దేశంలో ఆదరణ కరువై ఆమడ దూరం జరిగితే ఎక్కడో 10 వేల కిలోమీటర్ల దూరంలో నీకు తోడుగా మేమున్నామని అక్కున చేర్చుకొని కాన్బెర్రా పిల్లలు గత మూడు సంవత్సరాలుగా తెలుగు నేర్చుకుంటూ తమ మూలాల్ని వెదుక్కుంటూ అక్షర పక్షం చేరడం ఎంతో ముచ్చటైన విషయం. వీరంతా ముఖ్యంగా మాట్లాడడంపై దృష్టి సారించి వ్రాయడం చదవడం కూడా నేర్చుకుంటున్నారు.

2013లో ప్రారంభించబడిన కాన్బెర్రా తెలుగుబడి అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు షుమారు 35 మంది పిల్లలతో ముందుకు సాగిపోతోంది. ఇందులో పదిమందికి పైగా తలిదండ్రులు, భాషాభిమానులు స్వచ్చందంగా పనిచేస్తూ పిల్లలకి కావలసిన పాఠ్యంశాలు ఇక్కడి కాలమాన పరిస్థితులు బట్టి వారికి వారే వ్రాసుకునే స్థితికి చేరుకున్నారు. ఈ ప్రక్రియలో వివిధ ప్రభుత్వ సంస్థలు ఆర్ధిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీమతి మాధవీలత తలపనేని గారు తెలిపారు.

Telugubadi-2

ఆదివారం, OCTOBER 23 న 3వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ మాధవి లత తలపనేని మరియు వైస్-ప్రిన్సిపాల్ అపర్ణ రావినూతల అధ్యక్షతన ఈ కార్యక్రమము కనుల పండువుగా నిర్వహించబడింది.

తెలుగు బడి పిల్లలు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని కనువిందు చేసారు. వాచస్పతులుగా శ్రీమతి మాధురి కొలను మరియు శ్రీనివాస్ హనుమయ్యగార్లు తమ వాక్చతురత మరియు సమయస్ఫూర్తి తో ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించారు

Telugubadi-3

విద్యార్ధులకి కథల పోటీలు, ఉపన్యాసం పోటీలు మరియు ఫాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి ఇందులో ఉతీర్ణులయిన వారికి బహుమతులతో సత్కరించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షులు జావెద్ మెహెర్, కార్యదర్శి సంతోష్ గుప్త, ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఇన్ ఆస్ట్రేలియా – FTAA) అధ్యక్షులు శ్రీ కృష్ణ నడింపల్లి మరియు తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమతి రాధిక కొమల్ల ముఖ్య అతిధులుగా విచ్చేసారు.

రెండవ వార్షికోత్సవం గురించి తెలుగుమల్లిలో ప్రచిరించిన కధనం.

Send a Comment

Your email address will not be published.