కాలిఫోర్నియాలో టి-హబ్

ప్రపంచంలోనే అత్యధిక ఐ టీ పరిశ్రమలున్న అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అన్ని హంగులతో కూడిన సాంకేతిక కార్యాలయాన్ని, అంటే టి.హబ్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణా ఐ. టి శాఖా మంత్రి కె. తారక రామా రావు చెప్పారు.

అక్కడి కంపెనీలను ఆకర్షించడానికి ఈ హబ్ పని చేస్తుందని ఆయన చెప్పారు. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. సిలికాన్ వ్యాలీలోని శాంతా క్లారాలో నిర్వహించిన ఐ. టీ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ఆయన ఆ సదస్సులో తెలంగాణా ఐ. టీ విధానాన్ని వివరించారు. అక్కడి కంపెనీలతో అనేక ఎం.ఓ.యూలను కుదర్చుకున్నారు.

Send a Comment

Your email address will not be published.