కిరణ్ నిర్ణయం వాయిదా

పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాల మీద ఆయన ప్రస్తుతం శాసనసభ్యుల ద్వారా అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఆ తతంగం ఆదివారంతో ముగుస్తుంది. ఆ రోజున కొందరు శాసనసభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. అంతే కాక, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నగరంలో లేకపోవడం కూడా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడానికి ఒక కారణం. “ఇప్పటికే ఆలస్యం చేశాను. రాజీనామా చేయవద్దంటూ అంతా నా మీద ఒత్తిడి తెచ్చారు. మనం ఎంత చెప్పినా బిల్లును ఆపగలిగామా” అని ఆయన తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.