కిరణ్ రాజీనామా

Kiranఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినందుకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దాన్ని వెంటనే ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించే యోచనలో ఉంది. ఈలోగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉమ్మడి రాష్ట్రానికి చిట్ట చివరి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. సీమాంధ్రలో పర్యటించి అక్కడి సన్నిహితులు, కార్యకర్తలతో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తానని ఆయన చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి పదవితోపాటు, శాసనసభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

కాగా, ఆయన పదవికి రాజీనామా చేయడం అనివార్యమని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆయన ఎలాగూ రాజీనామా చేయక తప్పదని వారు చెప్పారు.సుమారు 53 ఏళ్ల కిరణ్ 2010 నవంబర్ 25న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కుటుంబానికి, తండ్రి కాలం నుంచి సుమారు 60 ఏళ్ల అనుబంధం ఉంది. గత జూలైలో కేంద్రం తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆయన కేంద్రంతో విభేదిస్తూ వస్తున్నారు. రాష్ట్ర విభజనతో అది పరాకాష్టకు చేరుకుంది.

Send a Comment

Your email address will not be published.