కీ బోర్డు సత్య

అతను సత్యంగా సరస్వతీ పుత్రుడే. ఆరేళ్ళ వయసులో తండ్రి చిటికెన వ్రేలు పట్టుకొని కచేరీలకు వెళ్ళే వయసులో తానే కచేరీ చేసిన ఘనుడు. రెండేళ్ళు నిండకముందే తల్లి గాత్రం టీవీలో విని ముగ్దుడైపోయిన సంగీత రస సారధి. తాత గొంతులో కర్ణాటక సంగీత కీర్తనలు విని స్వరాలకు రాజుగా వెలుగొందిన వైనం. లండన్ లోని ట్రినిటీ విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ళ వయసులో పియానో పరీక్షలు పాసైన కధనం. భారత దేశంలోనూ మరియు ప్రపంచంలోని ముఖ్య దేశాల్లో 20 ఏళ్ల వయసుకు మునుపే షుమారు 1700 కచేరీలు నిర్వహించిన గౌరవం. మరిన్ని వివరాలకు http://www.keyboardsathya.com/

వంశ పారంపర్యంగా వస్తున్న సుసంపన్నమైన సంగీత సంపదను ఆకళింపుజేసుకొని స్వరసాదనలో కీ బోర్డుని గాండీవంగా ధరించి సంగీత సామ్రాజ్యానికి గురువులైన శ్రీ మంగళంపల్లి, మాండొలిన్ శ్రీనివాస్ మొదలైన వారి ఆశీర్వచనములతో కీర్తి శిఖరాలను అధిరోహించిన యువకెరటం కీబోర్డ్ సత్య. అతి పిన్న వయసులోనే ఎన్నో బిరుదులు, అవార్డులు అందుకున్న విస్మయకర్త.

కీ బోర్డు సత్యగా ప్రసిద్ధి గాంచిన K.సత్యనారాయణ మొదటిసారిగా ఆస్ట్రేలియా అందునా మెల్బోర్న్ నగరానికి ఈ నెల వచ్చి రెండు కచేరీలు నిర్వహించనున్నారు. మొదటిది ఈ నెల 30 వ తేదీన వెల్లింగ్టన్ సెకండరీ కాలేజీ లోనూ రెండవది వచ్చే నెల 2వ తేదీన హాపర్స్ క్రాసింగ్ లోని మఫసల్ ప్రైమరీ స్కూలు లోనూ జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల్లో మొదటిది శ్రేష్టమైన కర్ణాటక సంగీతం అయితే రెండవది లలిత సంగీతం. వీరికి వయోలిన్ మరియు మృదంగం మెల్బోర్న్ నగరంలోని ప్రసిద్ధులైన శ్రీ మురళి కుమార్ గారు మరియు శ్రీధరాచారి గారు అందిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ చారి ముడుంబ తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా వచ్చే సొమ్ము హైదరాబాదులో శ్రీ చిన్న జీయర్ ట్రస్ట్ వారిచే నిర్మింపబడు “Statue of Equality” కి ఇవ్వబడుతుందని కూడా శ్రీ చారి గారు చెప్పారు.

south east concert flyer
satya west Concert_Flyer._final

Send a Comment

Your email address will not be published.