కుస్తీ పోటీలో సాక్షికి కాంస్యం

Sakshi Malikసాక్షి మాలిక్ కుస్తీ పోటీలో కాంస్య పధకాన్ని సాధించడంతో భారత్ కొంత ఉపశమనం పొందింది. హర్యానా లోని రోతక్ ప్రాంతానికి చెందిన సాక్షి మాలిక్ కుస్తీ పోటీలో భారతావనికి మొదటి బహుమతిని తెచ్చిపెట్టిన నారీమణి. తన 12 వ ఏట ఈశ్వర్ దాహియా గురువుగా కుస్తీ పోటీలో ఓనమాలు మొదలిడి 2010 లో జూనియర్ (58-kg) ప్రపంచ పోటీల్లో కాంస్య పతాకాన్ని, 2014 లో Dave Schultz International Wrestling Tournament (60-kg) లో బంగారు పతకం, 2015 లో దోహలో జరిగిన Senior Asian Wrestling Championships లో కాంస్య పతాకాన్ని చేజిక్కించుకుంది.

ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో వుండి ఆడపిల్లలకు అంతగా విలువనివ్వని దేశానికీ, సింధు, సాక్షి – ఇద్దరు మహిళలు రెండు ఒలింపిక్ పతకాలు సంపాదించి పెట్టడం ఇప్పుడు చాలా సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. బిడ్డలెవరైనా వారి పెంపకంలో లోపం వుంటే తప్ప, ఆడ మగ ఇద్దరూ ఒకటేనని చాలామంది ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.