కె.సి.ఆర్ తాజా నిర్ణయం

కాంగ్రెస్ పార్టీలో విలీనానికి తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. “కాంగ్రెస్ పార్టీలో విలీనానికి లేదా పొత్తుకు మేము సిద్ధమే. అయితే ఆ తరువాత తెలంగాణా పునర్నిర్మాణంలో నా పాత్ర ఏమిటో తేల్చి చెప్పండి” అని ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులను అడిగినట్టు తెలిసింది. అయితే విలీనం వైపే కాంగ్రెస్ మొగ్గు చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా రాష్ట్ర సమితి విలీనం చెందిన తరువాత పార్టీలో కె.సి.ఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని, పార్టీని ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను కూడా ఆయనకే వదిలేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మీరకు ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలిసింది. అభ్యర్థులను ఎంచుకోవడంలోనూ, ప్రచారంలోనూ ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇక ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చి పార్టీ వారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని, బహిరంగ ప్రకటన చేస్తారని తెలిసింది.

Send a Comment

Your email address will not be published.