కేసీఆర్ చండీ యాగం

తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అయుత చండీ యాగం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రం సిద్ధిస్తే ఈ యాగం చేస్తానని ఆయన గతంలో మొక్కుకున్నారట. గతంలో ఆయన మెదక్ జిల్లా కొండపాక గ్రామంలో సహస్ర చండీ యాగం నిర్వహించారు. అయుత చండీ యాగం అంటే పది వేల సార్లు హోమాలు చేయడంఅన్న మాట. ఈ అయుత చండీ యాగాన్ని వచ్చే నవంబర్ నెలలో చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ యాగాన్ని ఈసారి మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఉన్న తన ఫార్మ్ హౌస్ లో నిర్వహించబోతున్నారు. సృగేరీ పీఠానికి చెందిన వేద పండితులు ఈ కార్యక్రం జరుపుతారు. సుమారు నాలుగు వేల మంది పండితులు నవంబర్ 23 నుంచి 27 వరకు ఈ యాగం నిర్వహిస్తారు. ఈ యాగానికి ప్రధానిని, రాష్ట్రపతిని కూడా ఆహ్వానించాలని కే సీ ఆర్ భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.