కొండవలస కన్నుమూత

“అయితే ఓకే” డైలాగుతో పాపులర్ అయిన ప్రముఖ హాస్యనటుడు కొండవలస ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొండవలస నవంబర్ 2వ తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించిన కొండవలసను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడే చనిపోయారని వైద్యులు చెప్పారు. షుగర్ లెవల్స్, బీ పీ, పల్స్ రేట్ ఏవీ నమోదుకాలేదని తెలిపారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.

శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కొండవలస అసలు పేరు కొండవలస లక్ష్మణరావు.

ఆయన 1946 ఆగస్టు 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో పుట్టారు. టాలీవుడ్ లోకి అడుగుపెత్తకముండు ఆయన వైజాగ్ పోర్ట్ లో పని చేసారు. ఆరోజుల్లోనే నాటకరంగంలో బిజీగా ఉండేవారు. వెయ్యి కి పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన కొండవలస స్టేజ్ ఆర్టిస్టుగా యెనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. నాటకరంగంలో రెండు సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు.

ఆయన నాటకాలు చూసి ప్రముఖ దర్శకుడు వంశీ తన దర్శకత్వంలో వచ్చిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో క్యారెక్టర్ నటుడిగా అవకాశం ఇచ్చారు. అది 2002వ సంవత్సరం. అది ఆయన నటించిన మొదటి చిత్రం. ఈ సినిమాలో పొట్రాజుగా ఆయన నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘నేనొప్పుకోను.. ఐతే ఓకే’ అనే ఊతపదంతో ఆయన అనడరినీ కడుపుబ్బా నవ్వించారు. ‘ఇండియన్‌ గ్యాస్‌’ అనే నాటికలో తన శ్రీకాకుళం మాండలికంలో డైలాగులు చెప్పి అదే పంధాను ఆయన సినిమాల్లో తన పాత్రలకు అన్వయించుకున్నారు.

కొండవలస తన కెరీర్ లో దాదాపు 300 సినిమాల్లో నటించారు.

ఎవరే అతగాడు, కబడ్డీ కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ, పల్లకిలో పెళ్లికూతురు, అదుర్స్, సరదాగా కాసేపు తదితర సినిమాల్లో కొండవలస చెప్పుకోదగ్గ ఆహార్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆయన నటించిన ఆఖరి సినిమాలు దేవరాయ – శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి.

ఆయన ఆకస్మిక మరణంతో కొండవలస తెలుగు సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. ఓ మంచి నటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయింది.

ఆయన కుటుంబానికి చిత్ర పరిశ్రమ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. .

Send a Comment

Your email address will not be published.