కొత్త జిల్లాలకు ముహూర్తం

తెలంగాణాలో మొత్తం 31 జిల్లాలకు ముహూర్తం నిర్ణయించారు. దాని ప్రకారం కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిషన్లు, మండలాలకు ఈ నెల 10వ తేదీన అర్థ రాత్రి 12.21 గంటలు దాటాక నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. ఆ రోజున దశమి, శ్రావణ నక్షత్రం కావడంతో మంగళకరమైన రోజని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. తుది నోటిఫికేషన్ జారీ అయినా తరువాత ఏయే జిల్లాకు ఎన్నెన్ని పోస్టులో, ఏయే శాఖలకు ఎన్నెన్ని పోస్టులో నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నెల జిల్లాలు ప్రారంభం కాగానే ఉదయమే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యోగులంతా హాజరు పట్టీలో సంతకాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

Send a Comment

Your email address will not be published.