కొత్త పీసీసీ అధ్యక్షులు

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా రాష్ట్రానికి, సీమాంధ్రకు వేరు వేరుగా ఇద్దరు రాష్ట్ర కాంగెస్ అధ్యక్షులను నియమించింది. తెలంగాణాకు వరంగల్ కు చెందిన పొన్నాల లక్ష్మయ్యను, సీమాంధ్రకు అనంతపురానికి చెందిన రఘువీరా రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయదలచుకుంది. విలీనం జరగక పోయినా తెలంగాణా రాష్ట్ర సమితితో పొత్తుకు అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ లో చెబుతున్నప్పటికీ, తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు మాత్రం విలీనాలూ, పోత్తులూ లేనే లేవని తెగేసి చెబుతున్నారు.

Send a Comment

Your email address will not be published.