కొత్త రాజధానికి సింగపూర్ హంగులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒక వినూత్న రాజధానిని నిర్మించేందుకు, కొత్త స్మార్ట్ శాటిలైట్ నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు సింగపూర్ ముందుకు వచ్చింది. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈ మేరకు సింగపూర్ లో చర్చలు జరిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించేదుకు తాము సిద్ధంగా ఉన్నామని లూంగ్ తెలిపారు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీల నిర్మాణం, పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం,  గృహ నిర్మాణ కార్యక్రమాలను అధికంగా చేపట్టడం వంటి అంశాలను పరిశీలించడానికి రెండు కమిటీలను వేయాలని నిర్ణయించారు. సింగపూర్ నగరంలో వెంకయ్య నాయుడు పర్యటించి వివిధ అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించారు.

Send a Comment

Your email address will not be published.