కొద్దిలో జారిపోయిన దావూద్!

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా పేరున్న దావూద్ ఇబ్రహీం గత ఏడాది కొద్దిలో
'రా' కమాండోల నుంచి తప్పించుకున్నాడు. ఇది  అది 2013 సెప్టెంబర్ 13న,
పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతంలో జరిగింది. అతని ఆచూకీ తెలిసిన అధికారులు
అతన్ని హతమార్చడానికి లేదా ప్రాణాలతో పట్టుకోవడానికి 9 మంది కమాండో లను
నియోగించారు. అతన్ని వెంటాడుతున్న   కమాండోల చేతుల్లో అతను కొద్ది
సేపటిలో ఖతం అయిపోయేవాడే  ఇంతలో కారులో ఉన్న ఒక వ్యక్తి వద్ద ఉన్న ఫోన్
మోగింది. 'ఆపరేషన్ ఆపేయండి. ఆ వ్యక్తిని వదిలేయండి' అనేది ఆ ఫోన్ కాల్
సందేశం. ముంబై పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చీకటి సామ్రాజ్య
అధినేత దావూద్ ఇబ్రహీంను మట్టుబెట్టడానికి భారత నిఘా వర్గాలు అత్యంత
రహస్యంగా పైసోధించి అతని ఆచూకీని కనిపెట్టి పట్టుకున్నాయి. ఈ 9 మంది
కమాండో లను సూపర్ బాయ్స్ అంటారు. వాళ్లకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్నది
ఇంతవరకూ వెల్లడి కాలేదు కానీ, సుమారు 15 నెలల క్రితం జరిగిన ఈ సంఘటనను
మాత్రం నిఘా వర్గాలు బయటపెట్టాయి.  అతను కరాచీలో తరచూ ఆ రోడ్డు గుండానే
వేడుతుంటాడని తెలుసుకున్న కమాండోలు ఆ రోజున అతన్ని అనుసరించారు. కొద్దిలో
అతన్ని పట్టుకోబోతుండగా ఒక్క ఫోన్ కాల్ కారణంగా అతను తప్పించుకున్నాడు.
అతన్ని కాపాడుతున్నది పాకిస్తాన్ అనుకుంటున్నా వారు, అతన్ని కాపాడడానికి
భారత్  లోని కొన్ని శక్తులు కూడానని అర్థమవుతోంది.

Send a Comment

Your email address will not be published.