పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అట్టహాసంగా ప్రారంభించిన జన సేన ఎక్కడుంది. అది ఉండవలసిన చోటే ఉందా..?
దాదాపు సంవత్సరం క్రితం జనసేనను ఒక తుఫాను అని అభివర్ణించారు. కానీ ఇప్పుడు దానిని భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదన్నది పలువురి మాట. అంతేకాదు, అది కోమాలో ఉందని చెప్పేవారున్నారు.
జన సేన రావడంతోనే బోలెడన్ని మాటలతో ఎక్కడ పడితే అక్కడ అందరి నోటా నానింది. అయితే ఇప్పుడు…? ఎవరైనా అసలు ఆ పార్టీని అనుకుంటున్నారా…? ఏమైంది? ప్రజలు విపరీతంగా చెప్పుకున్నారు జన సేన గురించి. కానీ ఎన్నికలై అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోను కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన కొంతకాలానికే జనసేన ఆచూకీ లేకుండా పోయింది. జన సేన గురించి మాట్లాడుకునే వాళ్ళే కరువయ్యారు. జనసేన మీద పవన్ కళ్యాన్ కు అసలు మక్కువ ఉందా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. కానీ జవాబే లేదు.
ఇజం….బుక్కు వెనకాల, పవన్ కుడి భుజం అనుకున్న రాజు రవి తేజ ఇప్పుడు ఎక్కడా ఆ నటుడి వెంట కనిపించడం లేదు. అంతే కాదు అతను పవన్ తో పూర్తిగా దూరమైనట్లే సమాచారం.
మరోవైపు , నటుడు పవన్ తాను త్వరలో తన అనుభవాలతో ఒక బుక్కు విడుదల చేయబోతున్నానని చెప్పి కొన్ని నెలలైంది. కానీ ఆ బుక్ ఆచూకి లేదు. పైగా పవన్ తన సినిమా పనులతో బిజీగా మారారు. ఈ మధ్యే ఆయన నటించిన గోపాలా గోపాలా సినిమా పూర్తి అయ్యింది. ఇప్పుడు తన దృష్టి గబ్బర్ సింగ్ – 2 పైన ఉన్నట్టు పవన్ స్వయంగా చెప్పారు.
ఆయన ఇప్పుడు తన సినిమాలపైన దృష్టి సారించారని, ఒకవేళ తన సేవలు అవసరమని బీ జే పీ లేదా తెలుగు దేశం పార్టీ భావిస్తే ఆయన సేవలు అందించే విషయాన్ని ఆలోచిస్తారని అభిజ్ఞ వర్గాల భోగట్టా…
ఇదిలా ఉండగా ఆయనకు బీ జే పీ రాజ్య సభలో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నట్టు మరో వర్గం మాట.
ఇది ఇలా ఉండగా, ప్రముఖుడు పీ వీ పీ కూడా పవన్ తో సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారని తాకు. పీ వీ పీ పవన్ రాజకీయ కార్యకలాపాలకు దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు, పవన్ రాజకీయాలలో ఒక టిక్కెట్ ఇప్పిస్తారనే ఉద్దేశంతోనే పీ వీ పీ పవన్ వెంట అప్పట్లో తిరిగినట్టు, తీరా ఆయన అనుకున్నది జరగలేదు. దానితో ఎన్నికల తర్వాత పీ వీ పీ పవ కు దూరమై తన సినిమా ప్రొడక్షన్ పనులతో బిజీ అయ్యారని అనుకుంటున్నారు.
ఏదేమైనా జనసేన మళ్ళీ జనం లోకి వస్తుందా రాదా అనేదే ఇప్పటి సరాసరి ప్రశ్న.
దీనికి పవన్ కల్యానే జవాబు చెప్పాలి.