గబ్బర్ సింగ్ - 2 ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ – 2  సినిమా షూటింగ్ శ్రీకారం చుట్టుకుంది.

ఫిబ్రవరి 21వ తేదీన ఈ చిత్ర షూటింగు లాంచనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దైవసన్నిధిలో గబ్బర్ సింగ్ -2 షూటింగ్ ప్రారంభమైంది.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రచ్చ ఫేం సంపత్ నంది దర్శకత్వంలో శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూజా కార్యక్రమంలో హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత శరత్ మరార్, సంపత్ నంది తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామీపై ముహూర్తపు సన్నివేశాన్ని తీసారు.

నిర్మాత తండ్రి జీ కె మరార్ దంపతులు క్లాప్ ఇవ్వగా ప్రొడక్షన్ మేనేజర్ ప్రకాష్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత శరత్ మాట్లాడుతూ మూడేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ ఘనవిజయం సాధించిందని, అయితే ఆ చిత్రానికి ఇప్పటి గబ్బర్ సింగ్ – 2 సీక్వెల్ కాదని అన్నారు. కానీ గబ్బర్ సింగ్ – 2 చిత్రానికి కథ, రచన పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో సాగుతుందని చెప్పారు. ఈ సినిమా కథ అంతా కొత్తదని, కనుక కథా పరంగా  గబ్బర్ సింగ్ కు ఇప్పటి గబ్బర్ సింగ్ – 2  సీక్వెల్ కాదని వివరించారు నిర్మాత.

వచ్చే మే నెలలో అసలు షూటింగ్ ప్రారంభమై దసరా సమయంలో విడుదల చెయ్యాలన్నది తమ ఆశయమని నిర్మాత తెలిపారు.

Send a Comment

Your email address will not be published.