గవర్నర్ కు భారీ అధికారాలు

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై సర్వాధికారాలను కేంద్ర
ప్రభుత్వం గవర్నర్ కు అప్పగించింది. శాంతి భద్రతల విషయంలో గవర్నర్ కు
బాధ్యతలను మాత్రమే కాకుండా అధికారాలను కూడా అప్పగించడం విశేషం. ఈమేరకు
కేంద్ర హొమ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నిన్న లేఖలు
రాసింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం,
హైదరాబాద్ లోని జీ హెచ్ ఎం సి పరిధిలో శాంతి భద్రతల విషయంలో గవర్నర్ కు
ప్రత్యేక అధికారాలు ఉండాలని కేంద్రం భావించింది. దీని ప్రకారం, ఇక నుంచీ
ప్రజల ఆస్తులు, ప్రాణ రక్షణ బాధ్యత గవర్నర్ నరసింహన్ దే అవుతుంది.
సంస్థలు, ప్రభుత్వ భవనాల నిర్వహణ బాధ్యతలు కూడా ఆయన పరిధిలోనే ఉంటాయి.
ఇందుకు ఐజీల సారథ్యంలో ప్రత్యేక సెల్ లు ఏర్పాటు చేస్తారు.
మంత్రివర్గాలను సంప్రతించే బాధ్యతలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ,
గవర్నర్ సొంతగా కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. మంత్రివర్గ నిర్ణయాలనూ
తెప్పించుకోవచ్చు. గవర్నర్ సలహాలతోనే పోలీస్ అధికారులను బదిలీ చేయాల్సి
ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులు చూసి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి
కె. చంద్రశేఖర్ రావు మండిపడారు. ప్రధాని నరేంద్ర మోడీ నియంతగా
వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా త్వరలో
ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, పోరాటాలు ఉద్యమాలు
సాగిస్తామని ఆయన ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.