గవర్నర్ గిరీ వద్దే వద్దు

రాష్ట్ర గవర్నర్ కు కేంద్రం విశేష అధికారాలు కట్టబెట్టడంపై తెలంగాణా ప్రభుత్వం మండిపడుతోంది. కేంద్రంతో డీ అంటే డీ అంటోంది. “మీ ఉత్తర్వులు అమలు చేయలేం” అంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఘాటుగా లేఖ రాశారు. శాంతిభద్రతల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేననీ, గవర్నర్ కు అధికారాలు ఇవ్వడం సాధ్యం కాదనీ తేల్చి చెప్పింది. గవర్నర్ మంత్రివర్గ సూచనల మేరకే పని చేయాలనీ, విభజన సమయంలో చేసిన చట్టంలో ఇదే ఉందనీ అది పేర్కొంది. “మీ ఆమోదం లేకుండానే హొమ్ శాఖ ఈ లేఖ రాసినట్టుంది. దానిని రద్దు చేయండి” అని చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో అన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఎదురుదాడికి సిద్ధం కావాలని, న్యాయ పోరాటం జరపాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది.

ఇది ఇలా వుండగా, తెలంగాణా ప్రభుత్వ దిక్కారంపై కేంద్రం సీరియస్ అయింది. విభజనపై పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు, బిల్లును రూపొంచినప్పుడు దీనిని పొందుపరచడం జరిగిందని, రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో దీన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగిందనీ కేంద్రం తెలిపింది.

ఇప్పుడు దీన్ని ఉల్లంఘిస్తే రాష్ట్రపతినీ, పార్లమెంట్ ను, రాజ్యాంగాన్నీఅవమానించడమే అవుతుందనీ అది హెచ్చరించింది.
కాగా ఆంధ్ర రాష్ట్రం వారి పట్ల ఇక్కడి పోలీసులు వివక్షతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణా ప్రజలను కీసీ అర్ ఆంధ్ర ప్రజలపైకి రకరకాలుగా ఉసిగొలుపుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

Send a Comment

Your email address will not be published.