గుంటూరు జిల్లాలో రాజధాని?

కొత్త ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చి గుంటూరు సమీప ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు జూన్ 2 తరువాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్ 2న రాష్ట్రం అధికారికంగా రెండుగా చీలిపోతుంది. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత గుంటూరులో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. నాలుగు రోజులు హైదరాబాదులో, మూడు రోజులు గుంటూరులో గడపాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయ ఆవరణలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మంగళగిరిలో డీజీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.