గులాబీకే గులాం

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థను తెలంగాణా రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది.
శుక్రవారం వచ్చిన నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలతో హైదరాబాద్ నగరంపై
గులాబీ రంగు జెండా రెపరెపలాడింది. ఈ నెల 2న 150 సీట్ల నగరపాలక సంస్థలో
తెలంగాణా రాష్ట్ర సమితి 103 సీట్లను చేజిక్కించుకోగా మజ్లిస్ 41 సీట్లలో
విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి 1, బీజేపీకి 3, కాంగ్రెస్
పార్టీకి 2 స్థానాలు లభించాయి. పూర్తి మెజారిటీ రావడంతో తెలంగాణా రాష్ట్ర
సమితి స్వయంగా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు కూడా ఎంపికయ్యే అవకాశం
కలిగింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమారుడు, పంచాయతీ రాజ్ శాఖ
మంత్రి కె. తారక రామారావు ఎన్నికల ప్రచార సారథిగా తెరాస తరఫున ప్రచారం
నిర్వహించారు.

Send a Comment

Your email address will not be published.