గోడ దూకుడు మొదలు!

ఎన్నికలు సమీపిస్తున్నాయనగా రాష్ట్ర రాజకీయాల్లో గోడ దూకుడు వ్యవహారాలూ ఊపు అందుకున్నాయి. ఈ దూకుళ్ళ మీద రాష్ట్ర విభజన ప్రభావం కూడా ఉంది. ఆపద్ధర్మ మంత్రులు గంటా శ్రీనివాస రావు, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విశాఖకు చెందిన నలుగు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబును కలిశారు. వీళ్ళంతా సైకిల్ ఎక్కేందుకు మార్గం సుగమం అయింది. ఇక కర్నూల్, నెల్లూరు జిల్లాలకు చెందిన మరో ముగ్గురు శాసనసభ్యులు కూడా టీడీపీలో చేరబోతున్నట్టు తెలిసింది.

కాగా, తెలంగాణా ప్రాంతంలో అయితే పలువురు నాయకులు సైకిల్ కి స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నారు. రంగా రెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి, రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి బహిష్కరించిన లోక్ సభ సభ్యురాలు విజయ శాంతి కాంగ్రెస్ లో చేరిపోయారు. మాజీ మంత్రి రవీంద్ర నాయక్, ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు.

Send a Comment

Your email address will not be published.