గ్రాండ్ అలయెన్స్!

తెలంగాణా, సీమాంధ్ర లలో ఎన్నికల్లో విజయం సాధించడానికి ఒక గ్రాండ్ అలయెన్స్ ఏర్పాటు కాబోతోంది.  ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా భూస్థాపితం చేయాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలు ఒక్క తాటి మీదకు వస్తున్నాయి. ఇందుకు జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాన్ చొరవతీసుకొంటున్నారు. రెండు రోజుల క్రితమే జనసేన పార్టీని ప్రకటించిన పవన్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మొదటి దఫా చర్చలు పూర్తి చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులతోనూ ఆయన మాతా మంతీ జరిపారు.  ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో కూడా మాట్లాడడానికి సమయం అడిగారు.

కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అన్న నినాదంతో ఈ మూడు పార్టీలు ఒకే వేదిక మీదకు రాబోతున్నాయి. ఒక్క కాంగ్రెస్ మీదే కాకుండా జగన్ పార్టీనీ, తెలంగాణా రాష్ట్ర సమితిని కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకులతో పవన్ చర్చలు జరిపిన తరువాత ఈ బీజేపీ నాయకులతో ఆ పార్టీ సీనియర్ నాయకుడు జవదేకర్ హైదరాబాద్ లో చర్చలు జరిపారు. బీజీపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా పవన్ ను కలుసుకున్నారు. వారం రోజుల్లో ఈ అలయెన్స్ ఏర్పాటు అవుతుందని వెంకయ్య సన్నిహితులతో చెప్పారు.

Send a Comment

Your email address will not be published.